గొర్రెల కాపరికి కరోనా... క్వారంటైన్ లో గొర్రెలు, మేకలు..?
ఏంటి అని మీకు అనిపించినా ఇది నిజంగానే జరిగింది. పాపం.. గొర్రెల కాపరికి కరోనా వైరస్ సోకింది అని అతను పెంచిన గొర్రెలను, మేకలను క్వారంటైనా తరలించారు అధికారులు. ఇంకా ఈ ఘటన కర్ణాటకలోని తమకురు జిల్లా గొల్లరహట్టి గ్రామంలో చోటుచేసుకుంది. అదేంటి? క్వారంటైన్ మనుషులను తరలిస్తారు కానీ ఇలా గొర్రెలను కూడా తరలిస్తారా? అని మీకు అనిపించచ్చు. కానీ నిజంగానే తరలించారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గొల్లరహట్టి గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంకా అతనికి చెందిన కొన్ని గొర్రెలు, మేకలు శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నాయి. జలుబు, జ్వరం లక్షణాలతో బాధ పడుతున్న ఆ జంతువులను చుసిన గ్రామస్థులు వాటికీ కూడా కరోనా వైరస్ సోకిందేమోనని ఆందోళనకు గురవుతున్నారు. దీంతో గ్రామంలో టెన్షన్ పెరిగిపోయింది.
ఇంకా ఈ విషయంలో తెలుసుకున్న అధికారులు ముందు జాగ్రత్త చర్యగా సుమారు 50 గొర్రెలు, మేకలను క్వారంటైన్‌లో ఉంచారు. పీపీఈ కిట్లు ధరించి ఆ మేకల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. అయితే మేకలకు కరోనా సోకే అవకాశం లేదు అని అధికారులు చెప్తున్నారు.
అయితే మేకలకు, గొర్రెలకు కరోనా వైరస్ సోకినప్పటికి మనుషులకు కరోనా సోకుతుంది అనే ఆధారాలు లేవు అని వారు తెలిపారు. ఇంకా అమెరికాలోని న్యూయార్క్‌లో పులులు, సింహాలు, పెంపుడు పిల్లులు, కుక్కలకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా గొర్రెలను, మేకలను క్వారంటైన్ లో పెట్టడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.