కేసీఆర్ బీహార్లో పుట్టాడా...?

Chakravarthi Kalyan
పద్నాలుగేళ్లపోరాటం ద్వారా తెలంగాణ సాధించిన కేసీఆర్ పై విమర్శలు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. ఆయన్ను మెచ్చుకునేవాళ్లు ఎంతమందో.. విమర్శించేవాళ్లూ అంతకు ఎక్కువగానే ఉంటారు. తెలంగాణ ప్రాంతీయ వాదాన్ని భుజాన వేసుకున్న కేసీఆర్ కు అసలు ఆ అర్హతలేదంటూ చాలామంది అంటుంటారు. వాళ్లు చెప్పే కామన్ లాజిక్ ఒక్కటే.. అదే కేసీఆర్ విజయనగరం జిల్లాకు చెందినవాడని చెబుతుంటారు. కేసీఆర్ పూర్వీకులు అక్కడి నుంచి తెలంగాణకు వలస వచ్చాడంటారు. ఇదే డైలాగ్ చాలామంది సమైక్య ఉద్యమ సమయంలోనూ వల్లె వేశారు. ఇప్పుడు కేసీఆర్ కు సంబంధించి మరో కొత్త విషయం బయటికొచ్చింది. అదేంటంటే.. అసలు కేసీఆర్ తెలుగు నేలమీదే పుట్టలేదట. కేసీఆర్ బీహార్లో పుట్టాడట. పెరిగింది విజయనగరం జిల్లాలోనట. ఈ సంగతి చెప్పింది తెలంగాణ టీడీపీ నేత.. చిన్న మిరపకాయ.. రేవంత్ రెడ్డి. ఇంతకీ ఈ న్యూస్ కు సోర్స్ కూడా చెప్పాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ మేనమామ ఎం సత్యనారాయణరావే దీన్ని ధ్రువీకరించాడట. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన టీఎన్ ఎస్ ఎఫ్ మీటింగులో ఈ విషయాలు వివరించాడు రేవంత్. పనిలో పనిగా రేవంత్ కేసీఆర్ పై మరిన్ని విమర్శలు గుప్పించారు. ఉద్యమ సమయంలోనే ఉస్మానియా విద్యార్థుల ఆగ్రహం చవిచూసిన కేసీఆర్.. ఇప్పుడు ఓయూ పేరు చెబితేనే మండిపడుతున్నాడన్నారు. అంతే కాదు... కేసీఆర్ కు దమ్ముంటే.. సెక్యూరిటీ లేకుండా ఓ యూ విద్యార్థులతో అరగంట సేపు గడపాలని సవాల్ విసిరారు. స్థానికతకు 1956 ప్రమాణమని కేసీఆర్ చెబుతున్నారని... అలాగే తాము కూడా ఇక్కడి సీఎం ఇక్కడే పుట్టి ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. విద్యార్థుల ఆశలను వమ్ము చేస్తున్న కేసఆర్.. నిరుద్యోగుల జీవితాలతోనూ ఆడుకుంటున్నారని రేవంత్ మండిపడ్డారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: