స్వంత కారున్నా, ఆక్సిజన్ అందినా నాయుడు బ్రతికేవారా?!

Kuthuru RajiReddy
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడానికి కొంత నిర్లక్ష్యం, 108 వాహనంలో ఆక్సిజన్ సౌకర్యం లేక పోవడంగా చెప్పవచ్చు. తాను నిత్యం ప్రయాణించే బుల్లెట్ ఫ్రూఫ్ కారును కాదని వేరే కారులో ప్రయాణించడం వల్ల, ప్రయాణించిన కారుకు బుల్లెట్ ఫ్రూఫ్ లేకపోవడంతో ప్రమాదంలో కారు ద్వంసం కాగా నాయుడికి బలమైనటువంటి గాయాలు తగిలాయి. తెలుగుదేశం పార్టీ సినియర్ నాయకుడు ఎర్రన్నాయుడుని 2004 సంవత్సరంలో ఎంపీగా ఉన్నటువంటి సమయంలో మావోయిస్టులు మందుపాతర పేల్చగా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన నడుముకు తీవ్రగాయాలయ్యాయి. చనిపోయేనాటికి ఎర్రంనాయుడిని నడుం నొప్పి బాధించేది. కాగా నక్సలైట్ల మందుపాతర నుండి క్షేమంగా బయట పడిన ఎర్రన్నాయుడు అప్పటి నుండి బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని వాడుతున్నాడు . కాగా ఎప్పుడు అదే కారులో ప్రయాణించే ఎర్రన్నాయుడు కారణం ఏంటో గాని గురువారం నాడు వేరే కారులో ప్రయాణించి రోడ్డుప్రమాదానికి గురై దుర్మరణం పొందారని, కాగా ఆయన స్వంత కారులో ప్రయాణించి ఉంటే బ్రతికుండేవారు కావచ్చునని కొంత మంది అభిప్రాయాన్ని, ఆశభావాన్ని వ్యక్తపరుస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 2గంటలకు ప్రమాదం జరుగగా స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించడంతో వాహనంలో సమీపంలోగల ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఎర్రన్నాయుడిని రక్షించడం కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాగా చివరి వరకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన ప్రమాదం జరిగిన రెండుగంటల సమయంలోనే అంటే తెల్లవారుజామున 3-30 గంటలకు చనిపోయినట్లు దృవీకరించారు. కాగా గాయపడి ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి 108వాహనంలో ఆక్సిజన్ సౌకర్యం లేదని, అందుకే శ్వాస తీయడం ఇబ్బందిగా ఉండి చావుకు కారణం అయివుండవచ్చునని కొంత మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆక్సిజన్ అందుబాటులో ఉంటే ఎర్రంనాయుడు బ్రతికుండేవాడని స్థానికులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: