కొత్తమాటః చంద్రబాబు ప్రజలకు ఫిర్యాదు చేస్తాడట!

Padmaja Reddy

తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్ర బడ్జెట్ పై స్పందించిన తీరు ఆసక్తి కరంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏపీకి తీవ్రమైన అన్యాయం చేసిందని బాబు విరుచుకుపడ్డాడు. రెక్కలు విరిచి ఎగరమని అంటున్నారని... కాళ్లూ చేతులూ విరిచేశారని అంటూ బాబు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. తద్వారా తాము అన్యాయం అయిపోతున్నామని.. బాబు చెప్పాడు.

తమ మిత్రపక్షం అయిన భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం లోంది.. కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికార భాగస్వామి కూడా. మోడీ మంత్రి వర్గంలో తెలుగుదేశం వాళ్లు ఇద్దరున్నారు. మరి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం లో తెలుగుదేశం భాగమే. అయితే బాబు మాత్రం కేంద్రం అన్యాయం చేసింది... అంటున్నారు.

ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళతామని బాబు వ్యాఖ్యానించడం ఇక్కడ మరింత విశేషం. భారతీయ జనతా పార్టీతో తమకు రాజకీయ వైరుధ్యాలు లేవని... కేవలం ఈ ఆర్థిక వైరుధ్యాలు మాత్రమే ఉన్నాయని వ్యాఖ్యానించిన బాబు కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళతామని మాత్రం అన్నాడు!

అయితే విడ్డూరం కాకపోతే... ప్రజల దృష్టికి తీసుకెళ్లడం ఏమిటి? అన్ని విషయాల్లోనూ బాబు ప్రజల అభిప్రాయాలను తీసుకొనే ముందుకు పోతున్నాడా? ప్రజల వరకూ వద్దు... ఏ విషయంలోనైనా బాబు రెండో వారికి ఛాన్స్ ఇస్తున్నాడా?! మరి ఇప్పుడు మాత్రం బాబు ప్రజల దృష్టికి తీసుకెళతామని అంటున్నాడు! దీని ఉద్దేశం ఏమిటి? రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చి.. లేదా పరిస్థితిని వివరించి.. పోరాట మార్గం పట్టి సాధించాల్సిన విషయాల గురించి బాబు ఇలా ప్రజలకు వివరిస్తామని అనడం నిజంగా హాస్యాస్పదం. తమకు బీజేపీతో వైరుధ్యాలు లేవంటూ బాబు ఆ పార్టీతో సంబంధాలు తెగకుండా చూసుకొంటే.. ప్రజలు అంటూ కొత్త టోన్ వినిపిస్తున్నాడు. జరిగిన అన్యాయం గురించి ఇలా స్పందిచడం ఏమిటో!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: