కేసీఆర్ సాధించారు..!!

Edari Rama Krishna

60 యేళ్ల పోరాటంతో అహర్శశలు కష్టపడుతూ వచ్చిన తెలంగాణ ఉద్యమానికి రథ సారధిగా నడిచి అహింసతో మహాత్మాగాంధి సిద్ధాం నమ్మి ముందుకు నడిచిన వ్యక్తి కేసీఆర్. రాష్ట్ర పోరాట యోధునిగా ఆయనకు ఎనలేని కీర్తి లభించింది. తెలంగాణ సిఎం కెసిఆర్ కు సీఎన్ఎన్-ఐబిఎన్ పాపులర్ ఛాయస్ అవార్డు వరించింది.

మంగళవారం డిల్లిలో జరిగిన అవార్డు ప్రదానంలో కెసిఆర్ తరుపున తెరాస ఎంపి కె.కేశవరావు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లి చేతుల మీదుగా అందుకున్నారు. సీఎన్ఎన్ ఐబిఎన్ 2006 నుంచి ఆరు విభాగాల్లో ఈ అవార్డు అందిస్తుంది.

ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ గారు శాంతియుతంగా నడిపి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ కు దేశవ్యాప్తంగా ఆదరణ ఉందని తెరాస ఎంపిలు పేర్కొన్నారు. ఇది కేవలం సీఎన్ఎన్-ఐబిఎన్ ఇచ్చిన పురస్కారం కాదని, దేశ వ్యాప్తంగా ప్రజలు ఇచ్చిన పురస్కరమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ అనేది ఒక బ్రాండ్ అయితే ..ఆ బ్రాండ్ కి కెసిఆర్ అంబాసిడర్ అని పేర్కొన్నారు

. .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: