కోరుకొన్నది దక్కే వరకూ జేసీ అలానే మాట్లాడతారంతే!

Padmaja Reddy
ఒకరోజేమో ప్రత్యేక హోదా అనేది మరిచిపోవాల్సిన అంశమేనని చెబుతాడు. మరో రోజేమో రుణమాఫీ సాధ్యం కాదని స్పష్టం చేస్తాడు. ఇంకో రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనవసరం గా కేసీఆర్ తో పోటీ పెట్టుకొంటున్నాడని అది కరెక్టు కాదని స్పష్టం చేస్తాడు... ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటమా.. వంకాయా.. అని వ్యాఖ్యానించిన ఘనత కూడా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిదే

జేసీ జగన్ ను ప్రశంసిస్తున్నాడు.. 


ప్రతిపక్ష నేతగా జగన్ మోహన్ రెడ్డి రాణిస్తున్నాడని కూడా జేసీ దివాకర్ వ్యాఖ్యానించేశాడు. జగన్ ను సైకో అని సభలోని తెలుగుదేశం నేతలు అంటుంటే.. సభ బయట మాత్రం జేసీ జగన్ ను ప్రశంసిస్తున్నాడు. అలాగని తను వైకాపాలో చేరే అవకాశం లేదని కూడా జేసీ స్పష్టం చేస్తున్నాడు. మరి ఇంతకీ జేసీ లక్ష్యం ఏమిటి? అంటే.. వీలైతే కేంద్ర మంత్రి పదవి లేకపోతే.. సరైన నామినేటెడ్ పదవి అని తెలుస్తోంది!

జగన్ ను ప్రశంసిస్తున్నాడు


వీటిలో ఏదో ఒకటి దక్కే వరకూ కూడా జేసీ దివాకర్ రెడ్డి ఇలాంటి రన్నింగ్ కామెంట్రీ చెబుతూనే ఉంటాడు. కేవలం ఎంపీగా మిగిలిపోవడంతో జేసీకి దిక్కుతెలియడం లేదు. తన సీనియారిటీకి తగ్గట్టుగా ఏదో ఒక పదవి కావాలని ఆయన కోరుకొంటున్నాడు. టీటీడీ చైర్మన్ పదవితో సహా అనే పదవులు దివాకర్ రెడ్డి లిస్టులు ఉన్నాయి. వీలైతే కేంద్రంలో కనీసం సహాయ మంత్రి పదవి కావాలనేది ఆయన కోరిక. వీటిని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుకు విన్నవించాడు.


చంద్రబాబుకు తగిలీ తగలన్నట్టుగా 


అయితే బాబు మాత్రం వాటి విషయంలో సరిగా స్పందించడం లేదు. జేసీ కోరికలను నెరవేరుస్తానని కచ్చితంగాచెప్పడం లేదు. చూద్దాం.. చేద్దాం.. అంటున్నాడు. దీంతో దివాకర్ రెడ్డి తన సహజమైన కాంగ్రెస్ శైలిని బయటపెడుతున్నాడు. చంద్రబాబుకు తగిలీ తగలన్నట్టుగా విమర్శలు చేస్తున్నాడు. తను ఖాళీగా ఉన్నానన్న విషయాన్ని బాబుకు గుర్తు చేస్తున్నాడు ఈ మాటల ద్వారా. మరి దివాకర్ రెడ్డిని బాబు ఎప్పటికి గుర్తిస్తాడో.. ఆయనకు పదవిచ్చి ఎన్నటికి సంతృప్తి పరుస్తాడో!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: