జగన్ శ్రీరామనవమి వేడుకలు ఎక్కడ..?!

Padmaja Reddy

భద్రాచలంలో శ్రీరామనవమ వేడుకల్లో 


సాధారణంగా రాములోరి కల్యాణం ప్రతియేటా ప్రభుత్వం నిర్వహించడం తెలుగుగడ్డపై ఉన్న సంప్రదాయం. భారతదేశాన్ని విదేశీయులు పాలిస్తున్నప్పుడు మొదలైన ఈ సంప్రదాయం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగుతూ వస్తోంది. ఇన్ని రోజులూ తెలుగు ప్రభుత్వం భద్రాచలంలో శ్రీరామనవమ వేడుకల్లో భాగస్వామి అయ్యేది .అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రం చీలింది. భద్రాచలం తెలంగాణ ఖాతాలోకి వెళ్లింది.

భద్రాచలంలో శ్రీరామనవమ వేడుకలు


అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం శ్రీరామనవమి వేడుకల సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. అందుకు కడపజిల్లా ఒంటిమిట్టను వేదికగా ఎంచుకొంది. ఈ విషయంలో కొన్ని వివాదాలు తలెత్తినా ఏపీ ప్రభుత్వం మాత్రం ఒంటిమిట్టలో పండగను నిర్వహించడానికే కట్టుబడి ఉంది. ఇప్పుడు విశేషం ఏమిటంటే.. ఇక్కడ పండగ నిర్వహణకు ఏపీ ప్రభుత్వం అందరినీ ఆహ్వానిస్తోంది. ఆ ఆహ్వానాల్లో భాగంగా ప్రభుత్వ విప్ వెళ్లి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిని కూడా ఆహ్వానించి వచ్చాడు.

శ్రీరామనవమి వేడుకలు


సాధారణంగా శ్రీరామనవమి వేడుకలకు ముఖ్యమంత్రి హాజరవుతాడు. ప్రతిపక్ష నేత హాజరయ్యే సంప్రదాయం అయితే లేదు. మరి ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి తన సొంత జిల్లాలో జరుగుతున్న శ్రీరామనవమి వేడుకలకు వెళతాడా లేదా అనేది ఆసక్తికరమైన అంశమే! మామూలుగా అయితే ఇది పెద్ద మ్యాటర్ కాదు. అయితే తెలుగుదేశం పార్టీ ఈ మధ్య ప్రతి అంశాన్నీ జగన్ మనస్తత్వంతో ముడిపెట్టి మాట్లాడుతోంది. ఒకవేళ జగన్ ప్రభుత్వ అధికారిక శ్రీరామనవమి వేడుకలకు హాజరు కాకుండా .. తన పార్టీ ఆఫీసులోనే పండగను సెలబ్రేట్ చేసుకొన్నా తెలుగుదేశం వాళ్లు ఏదో ఒక విమర్శ చేసిన చేయగలరు! దీంతో జగన్ శ్రీరామనవమిని ఎక్కడ సెలబ్రేట్ చేసుకొంటాడనేది ఆసక్తికరంగా మారింది! 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: