కనీస వేతనం కోసం అమెరికాలో రోడ్డెక్కిన కార్మికులు..!!

Edari Rama Krishna

ప్రపంచంలో పెద్దన్నగా చెప్పుకుంటున్న దేశం అమెరికా. ఇప్పుడున్న పరిస్థతుల్లో అన్ని దేశాలను శాసించగల సత్తా ఉన్నా దేశం కూడా అమెరికానే.. మరి ఈ అమెరికాకు వివిధ దేశాల నుండి వలసలు వెళ్లే వారి శాతంకు కూడా ఎక్కువే. అలా దేశంలో ఇప్పుడు కార్మికులు రొడ్డెక్కారు. పెరుగుతున్న ఆర్థిక అవసరాల గురించి వారికిచ్చే వేతనాల గురించి రోడ్డెక్కారు.


కనీస వేతనం పదిహేను డాలర్లు ఉండాలంటూ నిరసన ప్రదర‌్శనలు కార్మికులు


 సుమారు 230 నగరాలలో వివిధ రకాల కార్మికులు కనీస వేతనం పదిహేను డాలర్లు ఉండాలంటూ నిరసన ప్రదర‌్శనలు చేశారు . ఒక్క న్యూయార్కు నగరంలోనే పదిహేను వేల మంది వరకు కార్మికులు ప్రదర్శనలో పాల్గొన్నారు.  ప్రస్తుతం అమెరికాలో కనీస వేతనం 8.75 డాలర్లుగా ఉంది. దీనిని పదిహేను డాలర్లు చేయాలని వారు కోరుతున్నారు. ఫాస్ట్ పుడ్ సెంటర్లు,పిల్లల సంరక్షణ కేంద్రాలలో పనిచేసేవారు. భవన నిర్మాణ కార్మికులు మొదలైనవారు ఈ ప్రదర్శనలలో పాల్గొన్నారు


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: