నిరుద్యోగులకు ఆర్టీసీ సూపర్ ఆఫర్..!!

Edari Rama Krishna
గత రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వాలకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని 43% ఫిట్ మెంట్ ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ చేస్తున్నారు. వీటిపై నిన్న చర్చలు జరిగాయి. ఫిట్ మెంట్ 28 % శాతం ఇస్తామని ప్రభుత్వం అంగీకరించినా ససేమిరా అన్నారు ఉద్యోగులు. దీంతో చర్చలు విఫలం అయ్యాయి. అంతే కాదు ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెంచితే ప్రభుత్వ ఖజానాపై అధనంగా భారం పడుతుంది. దీంతో తప్పని సరిగా ఆర్జీసీ చార్జీలు పెంచాల్సి వస్తుందని ప్రభుత్వ వాదన. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు.  కార్మికుల సమ్మె నేపథ్యంలో తెలంగాణ, ఏపీల్లో ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి కేంద్రికరించింది. ప్రైవేటు వ్యక్తులతోపాటు, పదవీ విరమణ పొందిన డ్రైవర్లు, కండక్టర్ల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. 


ఆర్టీసీ సమ్మెతో బస్టండ్ లో ప్రయాణికుల అగచాట్లు

  

విధులకు హాజరైతే కండక్టరుకు రోజుకు రూ.1000, డ్రైవర్కు రూ. 800 చెల్లిస్తామని వెల్లడించింది. హెవీ వెహికల్ లైసెన్సు ఉన్న వారు డ్రైవర్లుగా, పదో తరగతి తరగతి పాసైన వారు కండక్టర్లుగా పని చేయవచ్చని తెలిపింది. వీరికి భవిష్యత్తులో ఉద్యోగాల భర్తీ సమయంలో ప్రత్యేక ప్రాధాన్యమిస్తామని కూడా ప్రకటించింది. ఆసక్తి ఉన్న వారు ఆర్టీసీ డిపోలకు వెళ్లి అధికారులను కలవాలని సూచించింది. అలాగే… తాత్కాలిక కార్మికులతో బస్సులు నడిపేందుకు వీలుగా పోలీసుల సహకారం కోరడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: