హైదరాబాద్.. అదిరిపోవాలంతే..!?

Chakravarthi Kalyan
హైదరాబాద్ అభివృద్ధిపై తెలంగాణ సర్కారు దృష్టి పెట్టింది. పొరుగురాష్ట్రం అమరావతి జోరు చూసి వేగం పెంచారో ఏమో తెలియదు కానీ.. కేసీఆర్ ఈ మధ్య హైదరాబాద్ పై దూకుడు బాగా పెంచేశారు. ఇప్పటికే నగరంలో పలుచోట్ల భారీ ఎత్తున స్కైవేలు నిర్మించాలని డిసైడ్ చేశారు. 

కేవలం డిసైడ్ చేయడమే కాకుండా యుద్ధ ప్రాతిపదికన దాదాపు 3 వేల కోట్ల రూపాయల నిధులు మంజారు చేసేశారు. రెండున్నరేళ్లలో పనులు పూర్తి చేయాలని గడువు కూడా విధించేశారు.  ఇప్పుడు స్కైవేలకు తోడు మరో పెద్ద ప్రాజెక్టును జీహెచ్ఎంసీ ప్రకటించింది. 

భాగ్యనగరంలో మరో 20 ఫ్లైఓవర్లు నిర్మించనున్నామని జీహెచ్ ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ హైదరాబాద్ ప్రకటించారు. రద్దీగా ఉన్న జంక్షన్లలో , ప్రాముఖ్యత ఉన్న కారిడార్లలో ఇవి నిర్మిస్తామని ఆయన తెలిపారు. ఇందుకోసం 2631 కోట్ల రుపాయలను మంజూరు కూడా చేసేశారు. టెండర్లను మరో రెండురోజుల్లో పిలవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మొత్తం మీద హైదరాబాద్ అభివృద్ధిపై సుమారు 6 వేల కోట్లు రూపాయలు వెచ్చించనున్నారన్నమాట. కాంట్రాక్టర్ల కోసం కాకుండా.. నగర అవసరాలకు అనుగుణంగా ఈ కట్టడాలు జరిగితే హైదరాబాద్ ప్రతిష్ట మరింత ఇనుమడించడం ఖాయం. తర్వలోనే హైదరాబాద్  ప్రపంచస్థాయినగరంగా రూపొందడం నిశ్చయం. మరి ఆ చిత్తశుద్ధి తెలంగాణ సర్కారులో ఉందా..!?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: