ఆంధ్రాకు కేంద్రం అదిరిపోయే షాక్..

Chakravarthi Kalyan
ప్రత్యేక హోదాపై కేంద్రం ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.. ప్ర్తత్యేక హోదా ఆంధ్రాకే కాదు ఏ రాష్ట్రానికీ ఇచ్చే ఛాన్సే లేదని క్లియర్ కట్ గా తేల్చి చెప్పేసింది. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సాద్యం కాదని కేంద్ర సహాయ మంత్రి ఇంద్రజిత్ తేల్చి చెప్పేశారు. ఆంధ్రాజనం హోదాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ఇలా తేల్చి చెప్పడం నిజంగా షాకే. 

లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి ఇంద్రజిత్ ఈ విషయం స్పష్టం చేశారు. బీహారు కు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం జరిగిందే తప్ప, ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. అయితే ఓ చిన్న ఊరట కలిగే మాట కూడా చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి సంబందించి కేంద్రం వద్ద ఎలాంటి విధానం లేదని అన్నారు. అంటే ఒక వేళ కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదలచుకుంటే మాత్రం ఇవ్వడానికి ఏమాత్రం అడ్డంకి లేదన్న విషయం అర్థమవుతోంది. 

ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కేంద్రం కొన్ని కారణాలు చూపుతోంది. ఆర్దిక సంఘం సిఫార్సుల తర్వాత నలభై రెండు శాతం నిధులు రాష్ట్రాలకు వెళ్తున్నాయని.. ఇంత ఇచ్చాక కూడా ఇంకా ఇవ్వడం కుదరదని కేంద్రం చెబుతోంది. లోక్ సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ మాటలు చెప్పారు. ఐతే ఈ ప్రశ్న ఏపీని ఉద్దేశించి అడిగింది కాకపోయినా.. కేంద్రం ఓ మాట చెప్పిందంటే అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందనే అనుకోవాల్సి వస్తుంది. 

అసలే విభజన కష్టం.. మరోవైపు లోటు బడ్జెట్.. ఇలాంటి పరిస్థితుల్లో ప్ర్తత్యేక హోదా ఒక్కటే ఏపీని కాపాడుతుందని ఆంధ్రా రాజకీయ నాయకులు చెబుతూ వచ్చారు. దానికి తగ్గట్టుగా హోదా సాధిస్తామని టీడీపీ- బీజేపీ ఊరిస్తూనే వచ్చాయి. మరి ఇప్పటికైనా పొలిటికల్ మైలేజ్ సంగతి మాని రాష్ట్ర భవిష్యత్ గురించి సీరియస్ గా ఆలోచించి.. కనీసం ప్ర్తత్యేక ప్యాకేజీ కోసమైనా ఉమ్మడిగా కలసి పోరాడితే మంచిదేమో.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: