ప్రత్యేక హోదాపై మోడీతో మాట్లాడా : పవన్

Edari Rama Krishna
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ప్రజా సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ‘జనసేన’ పార్టీ స్థాపించారు. ప్రశ్నించేందుకు వస్తున్నా అన్ని నినాదంతో ప్రజల్లోకి వెళ్లాడు. పార్టీ స్థాపించిన సమయంలో సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పటికీ ప్రత్యక్షంగా పోటీ చేయకుండా బీజేపీ,టీడీపీలకు మద్దతు ఇచ్చి వాటి గెలుపునకు పరోక్షంగా సహాయం చేశాడు. గత కొంత కాలంగా పవన్ కళ్యాన్ రాజధాని భూ సేకరణ విషయంలో... రైతులకు అన్యాయం జరుగుతుందని వారి వద్ద నుంచి భూములు బలవంతంగా లాక్కుంటే దేనికైనా సిద్దమే అని రైతులకు జనసేన పార్టీ తరుపునుంచి హామీ ఇచ్చాడు.  

ఇప్పుడు భూసేకరణ బిల్లు పైన తాము వెనక్కి తగ్గుతున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.రెండు రోజుల్లో గ్రామ కంఠాల పైన తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పీ నారాయణ చెప్పారు. భూసేకరణ నోటిఫికేషన్ అనంతరం భూసమీకరణ ద్వారా మరో వెయ్యి ఎకరాలను తాము సేకరించామని ఆయన తెలిపారు.  తాజాగా పవన్ కళ్యాన్ ట్వీటర్ లో మరోసారి ప్రత్యేక హోదా పై ట్వీట్ చేశారు. రాజధాని ప్రాంతంలో రైతులతో సమావేశమవుతూ వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. తాజాగా, భూసేకరణ చట్టం కూడ రద్దు చేస్తామని మంత్రి ప్రకటించారు.

రైతులతో మాట్లాడుతున్న పవన్ కళ్యాన్


ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తాజాగా ప్రత్యేక హోదా అంశంపై ట్విట్టర్లో స్పందించారు. విభజన వేళ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి ప్రధాని నరేంద్ర మోదీకి గతంలోనే వివరించానని తెలిపారు. ఆయన రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకున్నారని తెలిపారు. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పటికే ఆలస్యమైందని, పరిస్థితుల దృష్ట్యా కొంత కాలం వేచి చూద్దామని సూచించారు.  రైతులకు ఎలాంటి ఆపద కలిగించమని వారికి నష్టం వాటిల్లే ఏ పని ఏపీలో జరగదని అక్కడ పీఎం, ఇక్కడ సీఎం హామీ ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేశారు పవన్ కళ్యాన్.

పవన్ కళ్యాన్ ట్విట్

pic.twitter.com/JswdQElw83

— Pawan Kalyan (@PawanKalyan) August 28, 2015

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: