మందు కొట్టి.. చిందులేసింది ! నేను ఓ వీవీఐపిని

పీకల దాకా మందు కొట్టి.. డ్రైవ్ చేసే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ......  చెప్పాల్సిన అవసరం లేదు. ఆ టైంలో  మందు బాబులు రోడ్ల మీద చేసే హంగామా అంతా ఇంతా కాదు. రోడ్లపై తెగ హడావిడి చేసి.. తీరా పోలీస్ స్టేషన్ కు వెళ్లాక.. తప్పు జరిగిదంటూ పోలీసుల కాళ్ల వేళ్ల పడి బతిమిలాడుకుంటారు. కానీ ఆ ముంబై అమ్మాయి మాత్రం పోలీసులకే ఝలక్ ఇచ్చింది. రివర్స్ గా ప్రవర్తించి ఆడాళ్లు ఇలా కూడా ఉంటారా అనిపించింది.

ఫుల్ గా మందు కొట్టి ఉన్న మహిళ..బీరు బాటిల్ ఎత్తి తాగేసింది


పీ....కల దాకా మందుకొట్టి ఉన్న ఓ మహిళను పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తే .. అక్కడ ఉన్న సిబ్బంది పై పైర్ అయ్యింది ఆ అమ్మడు. ఎవరికీ భయపడకుండా తెగ హడావిడి చేసింది. రాత్రి సమయం కావడం. అందులో ఎక్కువ మంది మహిళ పోలీసు సిబ్బంది లేకపోవడంతో.. పోలీసులు మహిళ చేస్తున్న హంగామా చూస్తూ ఉండిపోయారు. అప్పటికే ఫుల్ గా మందు కొట్టి ఉన్న మహిళ.. స్టేషన్ లో  అందరు చూస్తుండగానే గటగటా బీరు బాటిల్ ఎత్తి తాగేసింది. ఈ సీన్ చూసి పక్కన ఉన్న మగాళ్లు సైతం ఏమి మాట్లాడలేకపోయారు. ఆ తర్వాత తాగిన మైకంలో పోలీస్ స్టేషన్ లో తాగి చిందులేస్తూ రచ్చరచ్చ చేసింది..నేను ఓ వీవీఐపిని నన్నే అరెస్ట్ చేస్తారా అంటూ పోలీసులతో ఈ మహిళ గొడవకు దిగింది. తాగి చిందు లేస్తున్న అమ్మడిని తట్టుకోలేక..పోలీసులు చివరకు భామ మత్తు దించేందుకు మహిళా సిబ్బందిని రంగంలోకి దించాల్పి వచ్చింది.(source)


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: