విస్తరిస్తున్న మావోయిస్టుపార్టీ

Kuthuru Raji Reddy
కొంతకాలం పాటు నిశబ్ధంగా ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ ఉత్తరతెలంగాణలో మళ్లీ పుంజుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలకు పరిమతమైనటువంటి మావోయిస్టు పార్టీ క్రమంగా తెలంగాణ ప్రాంతంలో పాగా వేస్తుంది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో మావోయిస్టులు చాపకింద నిరులా వారి కార్యకలాపాలను విస్తరిస్తున్నారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడున్నారని, ఇన్ ఫార్మర్ గా పనిచేస్తున్నారని కొంతమందిని ఇటీవలే మావోయిస్టులు కాల్చిచంపారు. కాగా ఉత్తరతెలంగాణ లో నక్సల్స్ కార్యక్రమాలు సాగుతున్నాయని నిరుపించడంకోసం మావోయిస్టు పార్టీ ఉత్తరతెలంగాణ ప్రతినిధి జగన్ ఓచానల్ కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పేర్కోన్నారు. దీంతో మావోయిస్టు నక్సల్స్ వారి పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నారని స్పష్టమవుతుంది. నాయకత్వలోపం వల్లనే తెలంగాణ రాష్ట్రం రావడం ఆలస్యమవుతుందని కూడా మావోయిస్టుపార్టీ ప్రతినిధి పేర్కొన్నారు. పీఎల్ జీఏ వారోత్సవాలు నిర్వహించుకుంటున్నటువంటి మావోయిస్టుపార్టీ పలు వియయాలు వెల్లడించింది. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నామని చెబుతున్నటువంటి రాజకీయపార్టీలు పోరాటరూపాలను అందించలేకపోవడం వల్లనే తెలంగాణ ఉద్యమంలో స్థబ్ధత ఏర్పడిందని ప్రతినిధి జగన్ తెలియజేశారు. రాజకీయ పార్టీల నేతలను నిలదీయడం, ఉద్యమనాయక ద్రోహాన్ని ఎండగట్టి ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని ఉదృతం చేయాలని కోరారు. కాగా తెలంగాణలో మావోయిస్టు నాయకత్వంలో పేదలు ఆక్రమించుకున్నటువంటి వేలాది ఎకరాల భూమిని ఎవరు అమ్మినా, కొనుగోలు చేసినా సహించేది లేదని కూడా జగన్ హెచ్చరించారు. పాలకవర్గాలకు తొత్తులుగా మారి ప్రజలను ఇబ్బందులకు గురిచేసేటువంటి వారెంతటివారయిన తమ టార్గెట్ గానే ఉంటారని తెలిపారు. ప్రజాశక్తి అండగా పోరాడుతున్న పీఎల్జీ ముందు ఆధునిక సంపత్తి, అత్యాధునిక టెక్నాలజీకలిగినటువంటి భారతసైనిక బలగాలు దిగదుడుపేనన్నారు. ప్రజాశక్తి ముందు ఏశక్తి నిలువదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: