మంచిమాట: పనిచేయకుండా ఎవరు ఫలితాన్ని పొందలేరు!

Durga Writes

నేటి మంచిమాట... పనిచేయకుండా ఎవరు ఫలితాన్ని పొందలేరు. అవును. పని చేయకుండా ఎవరు ఫలితాన్ని పొందలేరు. ఇది నిజం. ఎందుకు అని మీకు సందేహం రావచ్చు. ఏ మనిషికైనా పని అవసరం. ఎందుకంటే.. పేదవాడు అయినా.. ధనవంతుడు అయినా ప్రతిరోజు ఏదో ఒక పని చేయాల్సిందే. 

 

ఎందుకంటే పని లేనిదే జీవితం లేదు. పని ఎంత చేస్తే అంత మంచిది. ఏ పని చేయకుండా కాలిగా ఉంటే మీకు పుట్టిన పిల్లలు కూడా మీకు విలువ ఇవ్వరు. అంతేకాదు.. పేద వాడు అయితే పట్టెడన్నం కోసం పని చెయ్యాలి.. ఉన్నవాడు అయితే ఉన్న ఆస్తులు తిరగకుండా పని చెయ్యాలి. అలా కాదు అంటే పేదవాడు మట్టిలో కాలుస్తాడు.. ఉన్నవాడు ఆస్తులు కరిగి పేదవాడిగా మారుతాడు. 

 

జీవితంలో పని ఎంతో ముఖ్యం. పని చెయ్యకపోతే కాలిగా ఉండి ఉండి.. ఏమి తోచక అనవసర ఆలోచనలు చేసి పిచ్చి వాళ్ళగా మారిపోయే అవకాశాలు చాలా ఉన్నాయ్. ఈ కాలంలో ఎంతోమంది యువతి యువకులు పని లేకనే సోమరిపోతులుగా మారి మానసిక బాధతో మరణిస్తున్నారు. వారి సంఖ్య కూడా ఎంతో ఎక్కువ. అంతేకాదు.. పని చెయ్యకపోతే మీరు అనుకున్నది.. మీకు కావాల్సినడి ఏది సొంతం కాదు. అసలు పని చేయకుంటే ఫలితం రాదూ. అందుకే కావాల్సింది దక్కించుకోవాలి అంటే కచ్చితంగా పని చెయ్యాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: