మంచిమాట‌: క‌రోనా వేళ రామ్ హీరోయిన్ చెప్పిన మంచిమాట ఫాలో అవ్వాల్సిందే..

VUYYURU SUBHASH

నిధి అగ‌ర్వాల్ తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా ఆమెకు రామ్ హీరోగా వ‌చ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో మంచి గుర్తింపు వ‌చ్చింది. ఆ సినిమాలో ఆమె సైంటిస్టుగా చేసిన న‌ట‌న‌తో పాటు అందాల ఆర‌బోత‌కు కుర్ర‌కారు ఫిదా అవ్వ‌డంతో సినిమా హిట్ అవ్వ‌డంతో ఆమె పాత్ర స్పెష‌ల్‌గా మిగిలిపోయింది. ఇక అక్కినేని కుర్రాడు అఖిల్ ప‌క్క‌న ఆమె న‌టించిన మిస్ట‌ర్ మ‌జ్ను సినిమా అంత‌గా ఆక‌ట్టుకోలేదు. ఇప్పుడు తెలుగులో మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తోంది. స‌రైన బ్రేక్ వస్తే పెద్ద హీరోల ప‌క్క‌న న‌టించాల‌న్న‌దే ఆమె తాప‌త్ర‌యంగా క‌నిపిస్తోంది.

 

తాజాగా ఆమె క‌రోనా వేళ త‌న సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ని సందేశం ఇచ్చింది. క‌రోనా వైర‌స్ విజృంభిస్తోన్న వేళ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే స‌మాచారం ఎంతో వ‌స్తుంద‌ని... దానిని పాటించ‌కుండా అస‌లు స‌మాచారం తెలుసుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించింది. ఇలాంటి టైంలో కొంద‌రు ఎందుకు ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే స‌మాచారం స్ప్రెడ్ చేస్తారో ?  కూడా తెలియ‌ద‌ని చెప్పింది. ఇక ఒడిశా ప్ర‌భుత్వం చేసిన సాయంపై ఆమె ప్ర‌శంస‌లు కురిపించింది. క‌రోనా వాస్త‌వాల కోసం  https://indiafactquiz.com  చెక్ చేసుకోవాల‌ని కూడా ఆమె సూచించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: