మంచి మాట : సంస్కారం  లేని చదువు వాసన లేని పూవు లాంటిది !

Edari Rama Krishna

-  ఇది ఛాలా క్లిష్టమైన సమస్య అనే సాకు వద్దు. క్లిష్టమైనది కాకపోతే అది సమస్య ఎందుకవుతుంది. 


- విద్య మనకు మంచి స్నేహితుడు. విద్యావంతుడైన వ్యక్తి ప్రతిచోటా గౌరవింపబడతాడు. 


- నిరంతర సాధన ఫలితమే నైపుణ్యం. అది అకస్మాత్తుగా వచ్చేది కాదు. 


- అహంకారం ప్రతి ఒక్కరి నుంచి, చివరకు భగవంతుని నుంచి దూరం చేస్తుంది. 


- పూల పరిమళం గాలి వాటుకే వెళుతుంది. కానీ మంచితనం ప్రతి దిక్కుకూ ప్రసరిస్తుంది. 


- వెలిగే దీపం ఇతర దీపాలను వెలిగించినట్లు, నిరంతరం నేర్చుకునే వారే ఇతరులకు జ్ఞానాన్ని పంచగలరు. 


- కోపం రావడం సహజం. కాకపోతే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలిసి ఉండటమే విజ్ఞత. 


- దేనినైనా ప్రేమతో చేసి చూడండి. అది మీ జీవితాన్ని సంతోషపరుస్తుంది. 


- మీరు చేసే పని అద్భుతంగా ఉండాలనుకుంటే దానిని ప్రేమించడం నేర్చుకోండి. 


- విద్య నీడ లాంటిది. దాన్ని మన నుంచి ఎవరూ వేరు చేయలేరు. 


- మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్నీ స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి. 


- వందమందికి నీవు సహాయ పడలేక పోవచ్చు. కానీ కనీసం ఒక్కరికైనా సహాయపడు. 


- నిన్నటి గురించి ఆలోచించకుండా రేపటి గురించి ఆలోచించే వ్యక్తికి విజయాలు దక్కుతాయి . 


- క్రమశిక్షణ, ఐకమత్యం దేశానికి నిజమైన బలం 


- అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి. 


- గమ్యాన్ని చేరుకోవడం కన్నా గమ్యం వైపు అడుగులు వేయడం ముఖ్యం. 

 

- ప్రతి క్షణాన్నీ ఒక మధుర జ్ఞాపకంగా చూపించగలిగేది ఒక్క ఫోటో మాత్రమే. 

- సాధించాలనే తీవ్రమైన తపన మనలోని బలహీనతల్ని అధిగమించేలా చేస్తుంది. 

- మనుషులను చంపగలరేమో గానీ, వారి ఆదర్శాలను మాత్రం కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: