మంచిమాట: చెడు ఆలోచనలే మన జీవితం లో సగం సమస్యలకు ప్రధాన కారణం!
మనం ఏదైనా మంచి పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు మంచి ఆలోచనలే చెయ్యాలి. ఆ పని గురించి చెడుగా ఆలోచిస్తే మనం ఆ పనిని జీవితంలో చెయ్యలేం. ఎదైనా కూడా మనం మంచిగానే ఉండాలి. మంచిగా ఉంటేనే ఏమైనా సాధించగలం. కానీ చాలామంది ఓ పని చేసేందుకు ప్రారంభంలోనే చెడు ఆలోచనలు చేస్తారు.
చెడు ఆలోచనలు మన జీవితానికే ప్రమాదం. ఎప్పుడు కూడా మంచిగానే ఉండాలి.. మంచి ఆలోచనలే చెయ్యాలి. ఉదాహరణకు.. లావు తగ్గాలి అనుకుంటారు. అందు కోసం జిమ్ కి వెళ్లాలి అనుకుంటారు. కానీ ఉన్నట్టుండి ఒకరు వచ్చి జిమ్ కి వెళ్లడం వల్ల ఎంత త్వరగా లావు తగ్గుతారో.. అంతే త్వరగా లావు పెరుగుతారు అని అంటారు.
ఇంకేముంది.. చెడు ఆలోచన బ్రెయిన్ కి చేరింది. జిమ్ కి వెళ్లినా సరిగ్గా వ్యాయామం చెయ్యలేం. ఇంకా ఆ సమయంలో లావు ఎందుకు తగ్గుతాం? అదే ఆ ఆలోచన లేకుండా.. ముందుగానే నిర్ణయం తీసుకొని ఉండి ఉంటే జిమ్ చేసి లావు తగ్గేవారు. లావు తగ్గడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేవారు.
అవును జిమ్ కి వెళ్తే లావు తగ్గుతారు. లావు తగ్గినా తర్వాత పెరుగుతారు. ఎందుకు పెరుగుతారు.. అతిగా తినడం వల్ల కనీసం డైట్ పాటించకపోవడం వల్ల లావు పెరుగుతారు. అదే మీరు జిమ్ కి వెళ్లి వచ్చాక సరైన డైట్ పాటిస్తే లావు ఎందుకు పెరుగుతారు. ఏది అయినా మనం ఆలోచించే తీరులోనూ.. మనం చేసే విధానంలోనే ఉంటుంది. అందుకే ఎప్పుడు మంచిగానే ఆలోచించాలి. మంచిగానే జీవించాలి.