మంచి మాట : నాలుక కత్తి కంటే పదునైనది. అది రక్తం చిందించకుండానే దేనినైనా నాశనం చేస్తుంది..!
నిన్న నువ్వు అనుకున్నది జరగలేఅదని అలోచిన్చివద్దు.. నీ కోసం దేవుడు నేడు అన్నది ఒకటి సృష్టించాడు. కొత్త ఉత్సాహంతో మరో సారి ప్రయత్నిచు ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు ఎవ్వరి తో పోల్చుకోకు ఎవ్వరి తో పోటి పడకు నీకంటూ ఒక చెరగని ఒక ముద్ర వుంది అదే నీ ఆత్మ భలం దాంతో ముందడుగు వేయి నీకు విజయం తధ్యం..
- పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు. అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది.
- నిన్ను చూసి చప్పట్లు కొట్టే పదివేళ్ల కన్నా నీ కన్నీరు తుడిచే ఒక్కవేలు మిన్న.
- కష్టసుఖాలకు సంసిద్ధంగా ఉన్నవారే స్వేచ్చగా జీవించగలరు.
- దేవుడు మనకు విజయాలనందివ్వడు. విజయం సాధించడానికి కావలసిన శక్తిని మాత్రమే ఇస్తాడు.
- ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు. సేవ అలవరచుకో, పెత్తనం కాదు.
- అద్దమే నా మంచి మిత్రుడు. ఎందుకంటే నేను ఏడ్చినప్పుడు అది తిరిగి నవ్వదు కనుక!!
- లేని గొప్పతనం ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడిపోతుంది.
- అత్తరు దుకాణానికి వెళితే అక్కడ మనమేమీ కొనకపోయినా కొంత పరిమళాన్ని గ్రహిస్తాం. ఉత్తముల సాహచర్యమూ అంతే!
- మానసిక ప్రశాంతత ఉంటే అన్ని సంపదలూ ఉన్నట్టే!
- మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు.
- జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి మిత్రుడు దొరికినప్పుడు కలుగుతుంది.
- అమ్మ వంటిది ఈ లోకంలో.. ఒకే ఒక్కటి.. మిగిలి ఉంది ..అదే స్నేహం అది భాష లేని మమకారం
- అవసరం.. స్వార్ధం.. మోసం.. దయ చేసి ఇవన్ని స్నేహంలో కలపకండి.స్నేహం యొక్క పదానికి పరువు తీయకండి !.....
-ఒంటరితనాన్ని కూడా తోడుగా మలుచుకోగలిగిన వాడు ఎప్పటికీ ఒంటరి కాలేడు.
-తప్పటడుగుల బాల్యం...తనివి తీరని యువ్వనం...తప్పించుకొలేని వృద్దాప్యం...
ఈ మూడు కలిపితేనే జీవితం...