మంచి మాట : వృక్షో రక్షిత రక్షితః..!

Divya

ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఇండియా హెరాల్డ్ మీకోసం  ఒక మంచి మాటను మీ ముందుకు తీసుకువచ్చింది. అదేమిటంటే వృక్షో రక్షిత రక్షితః.. దీనికి వివరణ ఏమిటంటే.. వృక్షాలను మనం ఎల్లవేళలా రక్షిస్తే, అవి మనల్ని రక్షిస్తాయి అని అర్థం.. కాబట్టి చెట్లను నిరంతరం కాపాడుకుంటూ రావాలి అనేదే ముఖ్యం అర్థం. చెట్లను పెంచడం వల్ల మనకు శతవిధాల ఉపయోగపడతాయి. చెట్లు లేకపోతే  మనకు జీవనాధారమైన ఆక్సిజన్ మనకు దొరకదు.. అంతేకాకుండా చెట్లు మనకు ఎలాంటి ప్రయోజనం కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

మనం వదిలిన కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకొని, మనకు ఆక్సిజన్ ను అందిస్తాయి. అంతేకాక మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి అంటే చెట్లు మనకు నీడని ఇస్తాయి. అలాగే పండ్లు, పూలు, వేర్లు, ఆకులు ఇలా చెట్టు యొక్క అన్ని భాగాలు కూడా మనకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ప్రకృతిలో లభించే ప్రతి మొక్క మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.

 అంతేకాకుండా ప్రస్తుత కాలంలో వాహనాల వాడకం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వాయు కాలుష్యం అవుతుంది. ఈ వాయు కాలుష్యం వల్ల మనకు ఎన్నో రకాల నష్టాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల సమస్య కూడా వచ్చి చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు . వాతావరణం కలుషితం అయితే వర్షాలు కూడా రావు. వర్షాలు లేకపోతే  మనకు తాగడానికి కూడా నీళ్లు కూడా దొరకవు. మనమే కాదు ఎన్నో జీవరాశుల ఆశ్రయం లేక  చనిపోతాయి.

 కాబట్టి వీలైనంత వరకు సగటు మనిషి కనీసం నెలకు ఒక చెట్టు నైనా పెంచడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా తమిళనాడుకు చెందిన శ్రీవారి మోటార్స్ వారు  అయితే ఏకంగా 10 చెట్లను నాటితే 25 వేల రూపాయల వరకు బైక్ కొనేవారికి రాయితీ కూడా ఇస్తామని ప్రకటించింది. అంతేకాకుండా ప్రస్తుతం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ క్రింద మొక్కలు నాటుతున్నారు.
 కాబట్టి వీలైనంత వరకు కనీసం ఒకరు ఒక చెట్టుని నాటడానికి ప్రయత్నించండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: