మంచి మాట : కష్టపడి చూడు.. విజయం వెతుక్కుంటూ వస్తుంది..!

Divya

హాయ్ ఫ్రెండ్స్.. ఎప్పటి లాగే ఈ రోజు కూడా ఇండియా హెరాల్డ్ మీ కోసం ఒక మంచి మాటను మోసుకొచ్చింది. అది ఏమిటంటే.. కష్టపడి చూడు, విజయం వెతుక్కొంటూ వస్తుంది.. దీని అర్థం ఏమిటంటే.. ఏ విషయంలోనైనా విజయం సాధించాలి అంటే సమయస్ఫూర్తితో కలిగిన కష్టం తప్పనిసరిగా ఉండాలి. కష్టపడకుండా ఏదీ ఊరికే రాదు.. కష్టే ఫలి.. కష్టపడితేనే ఏదైనా మన కాళ్ళ వద్ద ఉంటుంది అని గుర్తుంచుకోవాలి.. అని దీని అర్థం..

ఉదాహరణకు మీరు మీ జీవితంలో ఒక బిజినెస్ మెన్ కావాలని అనుకున్నారు అనుకోండి.. బిజినెస్ మాన్ కావాలి అనుకుంటే అందుకు తగ్గట్టు మీరు కూడా కష్టపడాల్సి ఉంటుంది. బిజినెస్ కు కావాల్సిన మెలకువలు ఏంటో తెలుసుకుని, అందుకు తగ్గట్టు అన్ని ప్రయత్నాలు చేయాలి.. నిరంతరం దానిపై పట్టుబట్టి శ్రమించినప్పుడే విజయం తప్పక వరిస్తుంది..

ప్రస్తుత కాలంలో నిరుద్యోగ సమస్య ఎక్కువ అవుతున్న తరుణంలో, నిరుద్యోగులు ఉద్యోగం సాధించాలన్న కోరిక తో ఎన్నో కోచింగ్ సెంటర్లు, ఆన్లైన్ క్లాసులు  లేదా వారే సొంతంగా తగిన ఉద్యోగానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు.. అలా ప్రిపేర్ అవ్వడం అంటే కేవలం రోజుకు 1- 2 గంటలు ప్రిపేరైతే సరిపోదు. ఒక టైం టేబుల్ ప్రకారం  ఫాలో అవ్వాల్సి ఉంటుంది.  ఒక పద్ధతి, సమయం రెండు అలవాటు చేసుకోవాలి.

సమయానికి పద్ధతి ప్రకారం చదివినప్పుడే,చదివినది గుర్తుంచుకొనే అవకాశం ఉంటుంది. ఫలితంగా మీరు రాసే ఏ పరీక్ష లో నైనా ఉత్తీర్ణత సాధించగలరు.. మీరు ఏ విషయంలో అయితే విజయం సాధించాలని అనుకుంటారో అందుకోసం  నిరంతరం కష్టపడినప్పుడే, మీరు సాధించాలనుకున్న ఉద్యోగం తప్పకుండా వస్తుంది. అంతేకాకుండా శ్రమ, సమయస్ఫూర్తి, నలుగురిలో మంచి నడవడికలు ఇవన్నీ సక్సెస్ కు పునాదులుగా  పరిగణించాలి.  అంతే కాదు ఒకసారి ఓటమి ఎదురైనా సరే పట్టువీడని విక్రమార్కుడు లాగా ప్రయత్నించి, మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి.. చూశారు కదా.. ఏది ఊరికే రాదు కష్టపడితే తప్పా..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: