మంచి మాట : వేల కొద్దీ నీతులు బోధించడం కన్నా.. ఒక మంచి పని చేయడం మేలు..
ప్రతి సారి ప్రతి క్షణం సరికొత్తగా వినూత్నమైన ఆలోచన తో ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూ, మీలో మార్పులు తీసుకురావాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది ఇండియా హెరాల్డ్.. ప్రస్తుతం అందులో భాగంగానే మీ కోసం ఒక మంచి మాటను మీ ముందుకు తీసుకు వచ్చింది. అదేమిటంటే..వేల కొద్దీ నీతులు బోధించడం కన్నా.. ఒక మంచి పని చేయడం మేలు..
ఒకరికి ఏదైనా సహాయం చేయాలి అన్నప్పుడు లేదా ఏదైనా ఎదుటి వారిలో మార్పు తీసుకురావాలంటే చాలా మంది ఉచితంగా వేలకొద్ది నీతులు చెబుతూ ఉంటారు..
నీతులు చెప్పే ఏ ఒక్కరు పనులు చేయడానికి ముందుకు రారు. నీతులు ఎవరైనా ఎప్పుడైనా చెప్పగలరు. ఎందుకంటే నీతులు చెప్పడానికి శ్రమ అవసరం లేదు కానీ ఎదుటివారిని మార్చాలి అంటే ప్రయోగాత్మకంగా మార్చాలి. ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు, ఆ తప్పు ఎందుకు చేశారు.. ఎవరికోసం చేశారు అని ఆలోచించకుండా.. అలా చేసి ఉంటే బాగుండేది.. ఇలా చేసి ఉంటే బాగుండేది అని శ్రీరంగనీతులు చెప్తారు.
కాబట్టి ఏది ఏమైనా ఎదుటి వాడి లోపాలను బయట పడుతూ ఉండడం కన్నా అందుకు తగ్గట్టు ఒక మంచి పని చేస్తే జీవితంలో ఎన్నో చేసినవారవుతారు. అంతేకాకుండా నీతులు చెప్పుకుంటూ పోతే కాలం వృధా అవుతుందే తప్ప ఏది జరగదు. నీతులు చెప్పడం అనేది మూర్ఖులు చేసే పని.. అదే ఒక చిన్న పని అయినా సరే మంచి పని గా మార్చుకొని ముందుకు సాగే లా చేసేది తెలివైన వాళ్ల పని..
వినేవాడు ఓపికగా ఉన్నాడు కదా అని ఏది పడితే అది మాట్లాడుతూ, ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా తోచిన సహాయం చేస్తూ,ఎదుటి వాడికి ఉపయోగపడేలా ఉండాలి తప్పా ఎదుటివారికి ఇబ్బంది పడే లాగా ఉండకూడదు. సమయాన్ని వృధా చేస్తూ చెప్పే మాటలు దేనికి పనికి రావు అని గుర్తించుకోవాలి. ఎన్నో వేల కొద్ది మాటలు మాట్లాడే బదులు ఒక చిన్న పని చేసి చూపిస్తే అది ఎంతో ప్రయోజనకరం..