మంచి మాట : మనిషికి మనిషి ఎప్పుడూ శత్రువు కాదు.. అతని బుద్ధి అతని నాశనానికి కారణం..!
ఆ మంచి మాట ఏమిటంటే..ఒక వ్యక్తి నాశనం అవుతున్నాడు అంటే అందుకు కారణం శత్రువై ఉండాల్సిన అవసరం లేదు..అతని బుద్ధి కూడా అతనిని నాశనం చేస్తుంది.. దీని అర్థం ఏమిటంటే.. ఒక వ్యక్తి తన స్వభావాన్ని మార్చుకొని, నాశనం అవుతున్నాడు అంటే దానికి ప్రత్యేకంగా మరొక వ్యక్తి అతన్ని ప్రోత్సహిస్తున్నాడు అని మాత్రం అనుకోవడం తప్పు. మనిషికి మనిషి శత్రువు ఎప్పుడూ కాలేడు. అతని యొక్క ఆలోచనలు కూడా అతన్ని శత్రువులా మారుస్తాయి అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఒక మనిషి నాశనం అవుతున్నాడు అంటే ఒక శత్రువై ఉండాల్సిన అవసరం లేదు. అతని బుద్ధి కూడా అతని వినాశనానికి కారణం అవుతుంది అని గుర్తించుకోవాలి.. దీని వివరణ..
నిజమే కదా..! ఒక వ్యక్తి మరొక వ్యక్తి ని ప్రేరేపిస్తున్నాడు అంటే, ఆ వ్యక్తి అతని పై ఎంత ఆధారపడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ వ్యక్తిని నమ్మాలా.. వద్దా.. అనేది కూడా మన బుద్ధి డిసైడ్ చేస్తుంది అని గుర్తుంచుకోవాలి. మనసు మాట వినని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ, ప్రతి ఒక్కరు బుద్ధి మాట వింటారు. మన బుద్ధి ఎలా చెప్తే అలా నేర్చుకోవాలి మనం. కానీ మన బుద్ధి ఎలాంటి మార్గాలను చూపిస్తుందో ఒక్కసారి మనసు తో ఆలోచిస్తే, మన బుద్ధి మనకు శత్రువు ఎప్పటికీ కాలేదు. మనం ఆలోచించే విధానాన్ని బట్టే మన గుణగణాలు లెక్కించబడతాయి.
కాబట్టి ఒక వ్యక్తి నాశనం అవుతున్నాడు అంటే మరొక వ్యక్తిని దూషించకుండా, అతని వినాశనానికి కారణం అవుతున్న బుద్ధిని మంచి మార్గం వైపు మళ్ళించడానికి ప్రయత్నించాలి. అతని ప్రవర్తనలో మార్పు తీసుకు వచ్చినప్పుడు, అతడు నాశనం అవ్వకుండా మంచి మార్గంలో నడవగలుగుతారు...