మంచిమాట : మంచితనం మరీ ఎక్కువైతే మన వాళ్లే శత్రువులు అవుతారు..
మనం నివసిస్తున్న ఆధునిక ప్రపంచంలో, ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీని మనం చూస్తూనే ఉన్నాము.. అయితే ఇవన్నీ మనకు తెలియాలి అంటే అన్ని రంగాలపైనా మనకు అవగాహన ఉండాలి. అప్పుడే ప్రపంచం నలుమూలల ఏం జరుగుతుందో అనే విషయం కూడా మనము తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీకు ఒకే వేదిక తారసపడుతుంది. ఆ వేదిక ఏమిటంటే "ఇండియా హెరాల్డ్" . ఇండియా హెరాల్డ్ ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను మీకు చూపిస్తూ మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలనే నెపంతో ఎప్పటికప్పుడు మంచి మాటలను మీ ముందుకు తీసుకొస్తుంది.. అందులో భాగంగానే ఈరోజు మంచి మాట ఏమిటంటే..మంచితనం మరీ ఎక్కువైతే మన వాళ్లే శత్రువులు అవుతారు..
దీని అర్థం ఏమిటంటే... మంచితనం మరీ ఎక్కువయితే మనవాళ్ళు శత్రువులు అవుతారు అనగా మంచితనం అనేది కొంతవరకు మాత్రమే ఉండాలి. అలా కాదని ప్రతిదానికి సర్దుకుపోయి, మనవాళ్లే కదా అని చిన్న పెద్ద సహాయం చేస్తూ పోతే, చివరకు వారే శత్రువులు గా మారుతారు. ఎప్పుడు ఎలా ఉండాలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మంచితనం మరీ ఎక్కువైనా కష్టమే లేదా మరీ తక్కువైనా కష్టమే.. అందుకే మంచితనాన్ని ఎప్పటికప్పుడు సమతుల్యం చేసుకుంటూ పోవాలి. మన వాళ్ళు అయినా బయట వాళ్ళు అయినా మంచి చేస్తే మంచి అని చెప్పాలి లేదా చెడు చేస్తే చెడు అని మాత్రమే చెప్పాలి.
అలా కాదని చెడు చేసినప్పటికీ మంచి చేశాడని, వారిపై మరీ విపరీతమైన నమ్మకం పెట్టుకోవడం వలన ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ చేతిలో మోసపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకు 10 సార్లు డబ్బులు ఇచ్చి, 11 వ సారీ అడిగినప్పుడు ఒకవేళ డబ్బులు లేవు అని చెప్పారు అనుకోండి.. ఇక అంతే మనం ఎన్ని నాళ్లు మిత్రులు గా ఉన్నప్పటికీ, కేవలం ఒకే ఒక్క సారి లేవు అనడంతో శత్రువుగా మారిపోతారు. అందుకే ఇతరులపై ఎక్కువ మంచితనాన్ని చూపించకూడదు. అందుకే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి..