మంచిమాట : ఆ.. పూర్వమే..అపూర్వం..! ఎన్నో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..

Divya

జరిగిపోయిన కాలం ఎప్పటికీ తిరిగి రాదు. కాబట్టి గడిచిన ప్రతి క్షణం మధురమైనదే.. గడిచిపోయిన ప్రతిక్షణం గురించి ఆలోచిస్తూ పోతే అందులో ఎన్నో ఆనంద క్షణాలను వెతుక్కోవచ్చు.. మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఎన్నో ఆటలు ఆడి ఉంటాము, పాటలు పాడుకుని ఉంటాము. అలాగే మన స్నేహితులతో కలిసి తిరిగిన ప్రదేశాలు, ఉపాధ్యాయుల చేత తిన్న దెబ్బలు, అలాగే గొడవలు, ఏడుపులు, కొట్లాటలు , కేరింతలు అబ్బో... ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో.. మనం చిన్నప్పుడు చదువుకునే సమయంలో  మనం చేసే చిన్న చిన్న తప్పులకు ఉపాధ్యాయులు మనలను శిక్షించేవారు.. అలా శిక్షించే ప్రతిదానికి ఒక నిగూడ అర్థం దాగి ఉందని అప్పట్లో మనకు తెలిసేది కాదు.. చిన్నచిన్న శిక్షలకు నిజమైన అర్ధం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


విద్యార్థులు తప్పు చేసినప్పుడు ఉపాధ్యాయులు వివిధ రకాలుగా శిక్షించేవారు.. ఆ వివిధ రకాల శిక్షలు ఏంటి.. వాటి అర్థాలు ఏంటి.. అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1. మనం అల్లరి చేసినప్పుడు ఉపాధ్యాయులు నోటి మీద వేలు వేసుకోండి అని అంటారు. అంటే దాని అర్థం మీరు నిశ్శబ్దంగా ఉండండి అని మాత్రం కాదు, నీ గురించి నీవు గొప్పలు చెప్పుకోవద్దు అని అర్థం.

2. ఇక మోకాళ్ల మీద కూర్చోండి అని చెప్పినప్పుడు, మనం ఏదో పెద్ద తప్పు చేసినట్టు కాదు.. మోకాళ్ళ మీద కూర్చోవడం అంటే జీవితంలో వినయంగా ఉండమని అర్థం..

3. ఇక చెవులు పట్టుకోమంటే .. చెప్పిన ప్రతి మాటను శ్రద్ధగా వినాలని, ఆ తరువాత తూచా తప్పకుండా పాటించాలి అని అర్థం.

4. బెంచీ ఎక్కి నిలబడమంటే.. నీవు చదువులో అందరి కంటే ఎప్పుడూ పైనే ఉండాలని అర్థం.

5. చేతులెత్తి నిలబడమంటే.. నీ లక్ష్యం ఉన్నతంగా ఉండాలి అని అర్థం.

6. గోడ వైపు చూస్తూ నిలబడమంటే.. ముందుగా ఆత్మ పరిశీలన చేసుకోమని అర్థం.

7. ఇక బ్లాక్ బోర్డ్ తుడవమంటే.. ఉపాధ్యాయులకు తుడిచే ఓపిక లేక కాదు.. మీ తప్పులను సరి చేసుకోమని అర్థం..

8. తరగతి గది బయట నిలబడమంటే.. పరిసరాలను పరిశీలించి నేర్చుకోమని అర్థం.

9. ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువసార్లు వ్రాయమని చెప్తే.. గెలిచే వరకు ప్రయత్నం ఆపకూడదు అని అర్థం..



చూశారు కదా ఫ్రెండ్స్.. మన ఉపాధ్యాయులు ఏం చేసినా ,  ఏం చెప్పినా మన మంచికే.. కాబట్టి ఉపాధ్యాయులను గౌరవిద్దాం..వారు చెప్పినట్లు నడుచుకుందాం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: