మంచిమాట : గొంతు పెంచడం కాదు .. నీ మాట విలువ పెంచుకో ..
ప్రతిరోజూ ప్రతిఒక్కరు సరైనా మార్గంలో నడవాలంటే వారికి కావలసిన సహకారం అందిచాలి . అది ఏ విషయం లోనైనా సరే ..ప్రతి ఒక్కరు మంచిమార్గం లో నడవాలంటే వారి ఆలోచనలు అదుపులో ఉంచుకోవాలి . అప్పుడే రహదారిలో వెళ్ళడాన్నికి వీలు ఉంటుంది . లేదంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా నలుగురితో మంచివాడు అని అనిపించుకోవాలే తప్పా ఇతరులతో వాగ్వాదానికి వెళ్ళకూడదు . మనం సంభాషించే ప్రతిమాట ఎదుటివారికి ఆనందాన్ని ఇవ్వాలి. వారిని మన మాటలతో కించపర్చరాదు .
ఉదాహరణకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, వచ్చిన వారితో గొడవ పడుతూ ,మన గొంతు పెద్దది చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు . సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలి . అప్పుడే సమాజం లో మన గౌరవం రెట్టింపు అవుతుంది .ఎప్పుడైనా సరే ఇతరులతో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా , సానుకూలంగా మాట్లాడాలి . ఎలాంటి పరిస్థితులలోనైనా కోపం తెచ్చుకోకుండా శాంతంగా మాట్లాడినప్పుడు ఎంతటి సమస్య అయినా గడ్డి పోచ తో సమానం అవుతుంది . సహనం మనిషికి అలంకారం కావాలి. మనిషి సహనం కోల్పోయినమప్పుడు విచక్షణా రహితంగా ప్రవర్తిస్తాడు . అప్పుడు నలుగురిలో నవ్వులు పాలు అవడం తో పాటు సమాజం లో ఎలాంటి గౌరవాన్ని పొందలేరు .
ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా ఆ సమస్య నుండి ఇతరులను బయట పడేయాలని చూడాలే తప్ప, వారికి సమస్య గా మనం మారకూడదు . ప్రతిఒక్కరు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి . ప్రతిఒక్కరితో కలసి మెలసి ఆనందంగా జీవించాలి. నీ కంటే పెద్దవాళ్లను గౌరవించడం నేర్చుకోవాలి . ఇక నీ కంటే చిన్నవాళ్లను ప్రేమించడం నేర్చుకోవాలి .నీతోటి వాళ్ళతో కలసి మెలిసి స్నేహ భావాలను పెంపొంచుకోవాలి .ఇక ఎప్పుడైతే ప్రతి మనిషి ఈ విషయాలను గుర్తుపెట్టుకొని నలుగురిలో జీవిస్తాడో ,అప్పుడు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే సంఘం లో వారికంటూ మంచి పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు లభిస్తాయి.
అంతేకాకుండా ఎంత తక్కువ మాట్లాడితే, అంత ఎక్కువ మనం విలువ పెరుగుతుందని గుర్తుంచుకోవాలి .అధిక ప్రసంగాలకు పోయి లేని పోనీ చిక్కుల్లో ఇరుక్కునే బదులు, మాట్లాడకుండా మౌనం వహించడం ఎంతో మంచిది. నలుగురిలో నీ గొంతు పెద్దది చేసి మాట్లాడినంత మాత్రాన నీ విలువ పెరగదు. నలుగురి లో నీ మాట కు వున్న విలువ ఏంటో తెలుసుకొని, ప్రవర్తించడం అన్నింటి కన్నా ముఖ్యం .ఒకానొక సందర్భం లో నీవు ఖచ్చింతగా మాట్లాడాలి అన్నప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడు. అనవసరమైన విషయాలలో తల దూర్చకుండా ఉంటేనే మంచిది. కాబట్టి ఎప్పుడు ,ఎక్కడ ,ఎవరితో , ఎలా మాట్లాడాలి అనే విషయాలను తెలుసుకొని, మాట్లాడడం వల్ల ప్రతిఒక్కరు నీ మాటకు ప్రాధాన్యం ఇస్తారు ..అందుకే పెద్దలు ఎప్పుడూ చెప్తూ వుంటారు గొంతు పెంచడం కాదు .. నీ మాట విలువ పెంచుకో .అని .. సో చూసారు కదా ఇప్పటికైనా మీ అవసరం వున్న చోట మాత్రమే మాట్లాడి, మీ మాట విలువ పెంచుకోవటానికి ప్రయత్నం చేయండి..