మంచిమాట : ఈ అలవాట్లతో ఎప్పటికి ధనవంతులు కాలేరు..

Divya

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి , ప్రతి పనికి డబ్బే మూలం.. అలాంటి డబ్బు కొంతమంది దగ్గర కొంతకాలమే ఉంటే, మరి కొంత మంది దగ్గర శాశ్వతంగా ఉంటుంది. కొంత మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా, వారి దగ్గర డబ్బు నిలవకుండానే పోతుంది. మనం చేసే కొన్ని కొన్ని పొరపాట్లే అలవాటుగా మారి,చివరికి  ఉన్న డబ్బు కూడా చేజారిపోతూ ఉంటుంది.. ముఖ్యంగా ఈ అలవాట్లు ఉన్నవారు ఎప్పటికీ జీవితంలో ధనవంతులు కాలేరట. ఆ అలవాట్లు ఏంటో ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..
1. సమయానికి నిద్ర లేవకపోవడం:
ప్రస్తుతం చాలామంది రాత్రిళ్లు లేటుగా నిద్రపోయి, ఉదయం పది , పదకొండు గంటలు అయినా సరే నిద్ర లేవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక అలాంటి వారి దగ్గరికి లక్ష్మీదేవి ఎప్పుడూ దరిచేరదట. ముఖ్యంగా సూర్యోదయం కంటే ముందే లేవడం అలవాటు చేసుకోవాలి. ఇక నిద్ర లేవడం వల్ల ఎన్నో పనులను తొందరగా చేసుకునే అవకాశం మనకు కలుగుతుంది. అందుకే ఉదయం, సాయంత్రం సమయాల్లో ఎక్కువగా పని చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని వృధా చేయకుండా కష్టపడితే డబ్బు కచ్చితంగా మన దగ్గర ఉంటుంది.
2. ఎప్పటికప్పుడు ప్రతిరోజు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోకపోవడం:
మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం తో పాటు మనల్ని  కూడా మనం  శుభ్రంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. మనం కనుక శుభ్రంగా లేనట్లయితే, అపరిశుభ్రత కారణంగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. ఇక వ్యాధుల బారిన పడితే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్న డబ్బును కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇక శుభ్రంగా ఉంటూ శుభ్రమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి.
3. మన ప్రవర్తన తీరుపై కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలా వద్దా నిర్ణయించుకుందట. మనం ఎదుటి వారితో మర్యాదగా మాట్లాడినప్పుడు, మన కష్టాల్లో ఉన్నప్పుడు ఆ ఎదుటివారే మనకు సహాయం చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు తోనూ, ప్రేమాభిమానాలతో మసులుకుంటూ అవసరమైన సమయంలో మన దగ్గర ఉన్నంతలో సహాయం చేస్తూ, అందరి దగ్గర మంచి అని  అనిపించుకోవాలి..
ఇక ఈ అలవాట్లు గనుక మన దగ్గర వుంటే ఎప్పటికీ లక్ష్మీదేవి నిలవదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: