మంచి మాట: అశ్వినీ దేవతల గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

Divya
అశ్వినీ దేవతలు అంటే ఎవరు..? అశ్వినీ దేవతలు పురాణ పురుషులు అలాగే కవలలు. వీరు సూర్యునికి  సంజ్ఞాదేవీ (ఛాయ దేవి) కి పుట్టిన వారు. సూర్యుడు - ఛాయాదేవి ఇద్దరూ అశ్వరూపంలో సంభోగంలో ఉండగా అశ్వినీ  పుత్రులు జన్మించారు. అయితే ముందుగా సూర్యుడు - ఛాయాదేవి అశ్వరూపంలో సంభోగంలో ఉండడానికి గల కారణం ఏమిటి..?  ఈ అశ్వినీ దేవతలు పొందిన వరం ఏమిటి ..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సూర్యుని భార్య సంజ్ఞాదేవీ ఒకసారి సూర్యుని వేడి కిరణాలను భరించలే,క సూర్యునికి చెప్పకుండానే ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక అప్పుడు ఆమె తండ్రి విశ్వ కర్మ  భర్తకు చెప్పకుండా ఎందుకు వచ్చావు..?  అంటూ.. తిరిగి నీ భర్త దగ్గరకు వెళ్ళిపో అని అన్నాడు. ఆమె..తన.  తండ్రి మాటకు ఎదురు చెప్పలేక అక్కడి నుండి వెళ్ళిపోతూ నేరుగా సూర్యుడు దగ్గరికి వెళ్లకుండా, భూలోకంలో ఉన్న హిమాలయ పర్వతాలకు చేరింది. అక్కడ గంధమాదన పర్వత శ్రేణుల మధ్య గుర్రం రూపంలో సంచరించసాగింది. ఇక చాలా కాలం నుండి ఆమె కనిపించకపోవడంతో, సూర్యుడు దక్షుడి ఇంటికి వెళ్ళాడు. దక్షుడిని ఆమె గురించి అడగగా ఆమెను ఎప్పుడో పంపించేశాను అని చెప్పాడు దక్షుడు.

ఇక సూర్యుడు లోకాలన్నీ వెతికి , హిమాలయాల్లో ఉన్న సంజ్ఞాదేవీని  కలుసుకున్నాడు. ఇక ఆమె అలుకకు కారణం తెలుసుకొని , సూర్యుడు కూడా అశ్వరూపంలోకి మారి , ఆమెతో కలిసి అక్కడే కొంతకాలం నివసించసాగాడు. అలా వారిద్దరూ  అశ్వ రూపంలో సంభోగంలో ఉండగా  అక్కడ వారికి ఇద్దరూ కుమారులు జన్మించారు. వారే నాసత్యుడు, దనుడు. ఇక తర్వాత సూర్యుడు, సంజ్ఞాదేవీ తిరిగి వారి యధా రూపాయలకు వచ్చారు. కానీ ఈ పుత్రులు మాత్రం గుర్రం రూపంలోనే పెరిగి పెద్దవారయ్యారు అశ్వినీ పుత్రులు. అశ్వం అంటే గుర్రం కాబట్టి వారిని అశ్వినీ పుత్రులు  అని పేర్లు మొదలు పెట్టారు.

ఆయుర్వేద శాస్త్రంలో మంచి ప్రావీణ్యం పొంది, తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఆయుర్వేద శాస్త్రంలో మరింత గుర్తింపు పొందడానికి , వారు లోకాలను తిరగసాగాడు. ఇక తరువాత సూర్యుడు ,సంజ్ఞాదేవీ నీ ఓదార్చి  అక్కనుండి తీసుకెళ్ళిపోయాడు. ఇక అశ్వినీ  పుత్రులను  ఆది వైద్యులుగా పురాణాలు వర్ణించాయి. అంతేకాదు వీరు మంచి మనసున్న దేవతలుగా పురాణాలు వర్ణిస్తున్నాయి. ఎవరికి ఏ కష్టం వచ్చినా సంధ్యాకాలంలో వేడుకుంటే ఖచ్చితంగా వారి కోరికలు నెరవేరుతాయని నమ్మకం అందరిలో ఉంది. ముఖ్యంగా సూర్యాస్తమయానికి 24 నిమిషాల ముందు అశ్వినీ దేవతలను మనసులో తలచుకొని,  కోరికలు కోరుకుంటే కోరికలు  తీరుతాయని పురాణాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: