మంచిమాట : సహాయం పొందిన వారిపై కృతజ్ఞత లేకపోతే ముప్పు తప్పదు..

Divya
సమాజంలో చాలా మంది ఇతరులు చేసిన సహాయాన్ని మరిచిపోయి, కృతజ్ఞత లేకుండా విచక్షణారహితంగా సహాయం చేసిన వారి పైన అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. అంతే కాదు ఇతరుల సహాయాన్ని పొంది, జీవితంలో పైకి ఎదుగుతూ.. సహాయం చేసినవారు వద్దకు వచ్చి , తిరిగి ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం అడిగితే , మీరు నాకు ఎప్పుడు సమయం చేశారు.. అనే దీనస్థితికి దిగజారారు.. అలా మనిషి వారిలో ఉన్న నైతిక విలువలను మరిచిపోయి కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ఇందుకు తగ్గట్టుగా ఒక చిన్న కథను ఇప్పుడు తెలుసుకుందాం..

అనగనగా ఒక అడవిలో ఒక అందమైన జింక నివసిస్తూ ఉండేది. ఆ  అడివంతా తిరుగుతూ.. తనకు నచ్చిన ఆహారాన్ని తింటూ ఉండేది. ఒకసారి ఒక వేటగాడు అడవికి వచ్చాడు. జంతువుల కోసం అడవిలో వెతికాడు. ఒక చెట్టు దగ్గర గడ్డి మేస్తున్న జింక అతని కంట పడింది. జింక కూడా వేటగాడిని పసిగట్టింది. వెంటనే అక్కడి నుండి పరుగుతీసింది.. వేటగాడు కూడా వేగంగా పరిగెత్తే జింకను వెంబడించాడు. ఇక జింక మరింత వేగంగా పరిగెత్తి, దారి పక్కన ఉన్న దట్టమైన పొదలో దాగి ఉంది. కొన్ని క్షణాల్లోనే ఆ వేటగాడు పొదల దగ్గరకు వచ్చాడు.. ఆ పొదలు  చాలా దట్టంగా ఉండడంవల్ల జింక అతనికి కనబడలేదు. వేటగాడు జింక కోసం వెతుకుతూ.. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయాడు.
అప్పుడు జింక హమ్మయ్య..! ఆపద తొలగిపోయింది. అని ఊపిరి పీల్చుకుంది. అక్కడ నుండి వెళ్దాం అనుకుంది కానీ ఆ పొదల లేత ఆకులను వెతుకుతూ తింటూ, ఆ పొదల చాటున నిలబడింది. దీంతో ఆ పొదలు  కొంచెం కదిలి శబ్దం చేసాయి. శబ్దం అక్కడికి దగ్గరలో ఉన్న వేటగాడి చెవిన పడింది. జింక ఆ పొదల చాటున దాక్కుని ఉన్నదని గ్రహించాడు ఆ వేటగాడు. వెంటనే బాణం సంధించాడు. ఇక ఆ బాణం గురి తప్పి జింక పక్కనుండి వెళ్లడం వల్ల జింకకు ప్రాణాపాయం తప్పింది. క్షణం ఆలస్యం చేయకుండా ఆ జింక అక్కడినుండి పరుగుతీసింది.
ఆపదలో ఉన్న నన్ను ఆ దట్టమైన పొదలు కాపాడాయి. కానీ నేను కృతజ్ఞత భావం లేకుండా పొదల ఆకులను తినడం వల్లే నాకు ప్రాణహాని జరగబోయింది.. కానీ, దేవుడి దయవల్ల వేటగాడి నుండి తప్పించుకున్నాను అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది జింక.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: