వేసవి కాలంలో ఒక రోజున ఒక టోపీల వర్తకుడు ఊరంతా తిరిగి కొన్ని టోపీలను అమ్ముకున్నాడు. మిగిలిన టోపీల మూటతో వాడు ఆ ఊరి చివర నున్న చెట్టు కింద చేరాడు. చెట్టు నీడలో చల్లగా ఉంటుందని అక్కడ తలక్రింద మూట పెట్టుకొని పడుకున్నాడు. ఇంతలో ఒక కోతల దండు ఆ చెట్టు మీదకు వచ్చింది. వర్తకుని నెత్తిమీద టోపీ , అతని తల క్రింద ఏదో మూట వాటికి కనిపించాయి. మెల్లగా రెండు కోతుల దిగివచ్చి, ఆ మూటను చెట్టు పైకి తీసుకొని పోయాయి. అవి మూట చింపి చూస్తే అందులో రంగురంగుల టోపీలు ఉన్నాయి. క్రింద పడుకున్న వాడు ఒక టోపీ పెట్టుకున్నాడు. అట్లాగే టోపీ లను పెట్టుకున్న వాళ్ళని కూడా పూర్వం అవి చూశాయి.
మనిషి ఏం చేస్తే.. అదే చేయడానికి కోతులు ప్రయత్నిస్తాయి.. వెంటనే ఒక్కొక్క కోతి వచ్చి తీసుకొని తలపై పెట్టుకొని కొమ్మలపైన కూర్చున్నాయి. ఏదో సభ చేస్తున్నట్లు గా కూర్చోవడం గమనార్హం. కొంతసేపటి తర్వాత ఆ వర్థకుడుకి మెలుకువ వచ్చింది.
అయ్యబాబోయ్..! నా టోపీల మూటను ఎవరో ఎత్తుకొని పోయారు అనుకుంటూ.. దిక్కులు చూస్తూ ఏడవడం మొదలుపెట్టాడు.. ఎవరినైనా అడుగుదాం అనుకుంటే , అక్కడ ఎవరూ కనిపించడం లేదు. అక్కడ పైన ఏదో చప్పుడు అయ్యింది . వెంటనే తల పైకెత్తి చూసాడు ఆ వర్తకుడు. చెట్టు మీద కోతులు టోపీలను ఒక దానితో మరొకటి మార్చుకుంటూ ఆనందంతో పరవశించి పోతాయి. కిచకిచ అంటూ ఏదో మాట్లాడుకుంటున్నాయి.
వాడు తన కోపాన్ని అణుచుకోవడం లేక గట్టిగా అరుస్తూ చంపేస్తానని చేత్తో బెదిరించాడు. అవి కూడా చేతులతో అట్లే చూపాయి. కింద పడేసి తొక్కేసి, చంపేస్తానని వర్తకుడు కాలితో నేల మీద తన్నాడు. కోతులు చెట్టుపైనే తన్నడం మొదలు పెట్టాయి..
ఇక ఇవి నేనేం చేస్తే అవి కూడా అదే చేస్తున్నాయి.. కాబట్టి ఒక చిన్న తమాషా చేస్తాను అనుకున్నాడు. ఛీ వెధవ కోతుల్లారా. ఈ టోపీని కూడా పట్టుకుని పొండి అని తన టోపీని నేలకేసి కొట్టాడు. వెంటనే కోతులన్నీ ఊ..! ఊ.! ఊ..! అంటూ టోపీ లన్ని నేలమీదికి విసిరే సాయి. ఆ టోపీలన్నింటిని ఏరుకొని మూటగట్టుకుని గబగబ పరిగెత్తే అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ వర్తకుడు. ఏదైనా పని చేయాలి అంటే శక్తి ఉంటే సరిపోదు తెలివి కూడా ఉండాలి.