మంచిమాట : సరైన ఆలోచన .. భవిష్యత్తుకు పూలబాట

Divya
అనగనగా ఒక ఊరు వుండేది. ఆ ఊరి పేరు రత్నగిరి. ఇక రత్నగిరి రాజ్యాన్ని పరిపాలించిన జయంతుడు అనే మహారాజుకు వరుణుడు, సంజయుడు, సుధీరుడు అనే ముగ్గురు కొడుకులు ఉండేవారు. ఇక వృద్ధాప్యం లోకి అడుగుపెట్టిన మహారాజు జయంతుడు తన తర్వాత రాజ్య భారాన్ని ముగ్గురు కొడుకుల్లో ఎవరికి అప్పగించాలనే ఆలోచనలో పడ్డాడు.మంత్రిని పిలిచి విషయం చెప్పగా, అప్పుడు మంత్రి.. ఇందులో సందేహం ఏముంది మహారాజా..! సాంప్రదాయం ప్రకారం పెద్దకొడుకుకే రాజ్యాధికారం లభిస్తుంది.." అని అన్నాడు.
కానీ మంత్రివర్యా..! " నా ముగ్గురి కుమారులలో మిక్కిలి తెలివైన వాడికే పట్టాభిషేకం చేయాలన్నదే నా కోరిక". అన్నాడు రాజు. కొద్ది రోజుల తరువాత ఒక నాడు మహా రాజు జయంతుడు తన  పెద్దకొడుకు వరుణుడిని పిలిచి, ఇక్కడ ఉన్న మూడు గదుల్లో ఒకదానిలో దండిగా ధాన్యరాశులు ఉన్నాయి. రెండవ దానిలో ఆయుధ సంపత్తి ఉంది. మూడవ దానిలో పుష్కలమైన ధనరాసులు ఉన్నాయి. ప్రజాక్షేమం దృశ్య ఏదో ఒక గదిని కోరుకోమంటే ..నీవు ఏ గదిని కోరుకుంటావు.. అని ప్రశ్నించాడు.
ప్రజలకు అన్నింటికంటే ఆహారం ముఖ్యం అందువల్ల ధాన్య రాశులని కోరుకుంటాను. అన్నాడు వరుణుడు. రెండవ కొడుకు సంజయుడు ని పిలిచి అదే ప్రశ్న వేయగా ..శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు.. తింటూ కూర్చుంటే సరిపోదు ..యుద్ధం చేయటానికి ఆయుధాలు కావాలి. కాబట్టి ఆయుధాలు ఉన్న గదిని కోరుకుంటాను. అన్నాడు.
మూడవ కొడుకు సుధీరుడిని పిలిచి ప్రశ్నించ, గా నేను ధనరాసులు ఉన్న గదిని కోరుకుంటాను. ఎందుకంటే పుష్కలమైన ధనం ఉంటే ఆహారం, ఆయుధాలు ఎంతైనా సమకూర్చుకోవచ్చు. మిగిలిన ధనంతో ప్రజలకు ఎన్నో సౌకర్యాలు సమకూర్చుకోవచ్చు. అన్నాడు
ఇక తెలివైన వాడు యోగ్యుడు అయినటువంటి సుధీరుడికి పట్టాభిషేకం చేసి , తన ప్రస్థానానికి తరలిపోయాడు మహారాజు..
కాబట్టి ఎవరైనా సరే ఏదైనా ఆలోచించేటప్పుడు, భవిష్యత్తును ఆలోచనలో పెట్టుకొని కార్యాలు చేస్తే, ఎప్పటికైనా ఫలితం లభిస్తుంది అనేది ఈ కథలోని నీతి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: