మంచి మాట : కళ్ళుండి.. కళ్ళులేని కబోది లా బ్రతుకుతున్నారు .!
ఒక నాడు అక్బర్ బాదుషా గారు బీర్బల్ తో కలిసి నగర సంచారానికి బయలుదేరారు. వారికి కొంత దూరంలో ఒక ముష్టివాడు ,ఒక పౌరుడు..నువ్వు మోసగాడి వంటే నువ్వు మోసగాడు అని దెబ్బలాడుకుంటూ కనిపించారు. అక్బర్, బీర్బల్ తో కలిసి వాళ్ల వద్దకు వెళ్లి.. ఎందుకిలాదెబ్బలు ఆడుతున్నారని ప్రశ్నించారు
అక్బర్ .. వాడు కళ్ళులేని కబోదిగా ప్రవర్తించటం తప్పు కాదా అన్నాడు.. అప్పుడు బీర్బల్ కూటి కోసం కోటి వేషాలు.. ఎదుటి వారి దయ కోసం తాను గుడ్డివాడిగా నటిస్తున్నాడు వీడు.. కానీ చాలా మంది కళ్ళు ఉండి కూడా కబోదుల్లా ప్రవర్తిస్తుంటారు. అన్నాడు . అలాగైతే అలాంటి కబోదులు, కళ్ళున్నవాళ్ళు ఎవరెవరు తేల్చి చెప్పవలసిందని అక్బర్ బీర్బల్ ను ఆదేశించారు.
ఆమర్నాడు ఊరికి శివారున. సామాన్య దుస్తులు వేసుకొని బీర్బల్ ఒక వ్రాత గాడిని వెంట కూర్చుండబెట్టుకొని జోళ్లుకుడుతూ కూర్చున్నాడు. ఆ త్రోవన వెళుతున్న వాళ్ళు బీర్బల్ ను చూసి కొందరు మీరు జోళ్లుకొడుతున్నారా..? అని ,ఏం చేస్తున్నారని ..? మరికొందరు అంటూ పలకరిస్తూ తమ దారిన వెళ్ళిపోతున్నారు. ఈ వైనం అంతా వ్రాత గాడి చేత జాబితా రాయిస్తున్నాడు. అదే త్రోవన వెళుతూ అక్బర్ గారు బీర్బల్ ను చూసి , ఏం చేస్తున్నావ్ బీర్బల్ అని ప్రశ్నించి సమాధానం పొంది వెళ్లిపోయారు.
ఆ మరుసటిరోజు బీర్బల్ ఆ పుస్తకాన్ని ఇచ్చి అక్బర్ కు చూపించి.. చూసారా మహాప్రభో.. ఆఖరికి మీరు కూడా కళ్ళుండి నేను ఏం చేస్తున్నాను ..? అని అడిగి వెళ్లారు అంటూ చెప్పాడు. ఇక అక్బర్ కళ్ళు తెరుచుకొని, ఇకపై ఎలా ఉండాలి..? ఎలా ప్రవర్తించాలి..? నేర్చుకున్నాడు.