మంచి మాట : విశ్వాస.. అవిశ్వాసలకు తేడా ఇదే ..!
అప్పుడు బీర్బల్ లేకేం పాదుషా..! విశ్వాసానికి పెట్టింది పేరు శునకం. స్వల్పమే అయినా ఒకసారి తిన్న శునకం ఎల్లకాలం పెట్టినవారి పట్ల విశ్వాసం కలిగి ఉంటుంది. వారికి గాని , వారి ఇంటికి గాని ఏ విధమైన ఇబ్బంది కలగకుండా గుర్తు కలిగి ప్రవర్తిస్తుంది. మనిషి తనకు ఇచ్చింది ఎంతయినా ,చేసినమేలు ఎంతటిదైనా కృతజ్ఞత చూపకపోగా, కపటప్రేమను అభినయిస్తూ మరింతగా తనను ఆదరించలేదని అలుగుతాడు. వారి క్షేమం కోరటం మాట అటుంచి , తన ప్రయోజనం కోసం ఎట్టి చెడును చేయడానికైనా వెనుకాడడు. నరుని కన్నా విశ్వాసహీనుడు మరొకరు ఉండబోడు. మీరు అంగీకరిస్తే రేపటి రోజున విశ్వాసం , అవిశ్వాసం కలిగిన వారిని తమ సమక్షంలో నిలబెడతాను అన్నాడు.
ఆ మర్నాడు అతనోక కుక్కను, ఒక వ్యక్తిని తీసుకొని సభకు వచ్చాడు. జహాపనా ఇది నా వీధిలో తిరిగే కుక్క దీనికి అప్పుడప్పుడు శేష పదార్థాలను పెడుతుంటాము. మా ఇంటి వద్దనే ఉంటూ మమ్మల్ని మా క్షేమాన్ని కోరుతూ మసలుకుంటుంది. అని చెప్పి దానిని నుండి వెళ్లగొట్టమని సేవకులకు ఆజ్ఞాపించండి. నిదర్శనం మీకే తెలుస్తుందన్నాడు. రాజభటులు దానిని బీర్బల్ నుండి తరమభోగా అది వారి మీద తిరగబడి , తరిమి బీర్బల్ దగ్గరకు వచ్చి కూర్చుంది. వెంట తీసుకువచ్చిన మనిషిని ముందుకు పిలిచి సార్వభౌమ ఇతడు మా ఇంటి పక్క వారి అల్లుడు ప్రతియేటా ఇతన్ని పిలిచి చీనాంబరాలు కట్న కానుకలు ఇచ్చి మర్యాద చేస్తుంటారు మామగారు. అతనికి ఈ ఏడాది మామ గారు ఏమి ఇచ్చారో అడగండి అన్నాడు, ఏమయ్యా మీ మామయ్య గారు ఈ సంవత్సరం ఏమి ఇచ్చారు. అని ప్రశ్నించాడు అక్బర్ ప్రభు. పెట్టిపోతలమొక్కుబడి తీర్చుకున్నాడు. కట్నకానుకలవిషయం లో మామగారు అంతా పిసినారి మరొకరు ఉండరు.ఈ స్వల్పానికి మమ్మల్ని రమ్మనడం మాకు ఖర్చులు కలిగించటం దేని కండి.. ఆ పాటి కట్నకానుకలు నేరుగా పంపించవచ్చు కదా..! మేమురావడం దేనికి అంటూ మామగారు చేసే పనులను దేప్పి పొడుస్తూ,మరింత చెప్పడంతో అక్బర్ పాదుషా వారికి అర్థమయ్యింది. మనిషి ఎంత స్వార్ధపరుడో తెలిసింది.
కుక్క ను మించిన విశ్వాసం గలజీవి మనిషి ని మించిన విశ్వహీనుడు ఉండరన్నది .తెలిసేలా చేసి చెప్పిన బీర్బల్ ను అక్బర్ పాదుషా పొగిడారు.