మంచిమాట: వృద్ధుల ప్రాణాలను కాపాడే వృద్ధాశ్రమాలు వర్ధిల్లాలి..!
యాదయ్య ఒకరోజు పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళాడు. కొడుకు, కోడలు వచ్చి గుమ్మంలోనే నిలుచున్నారు. ఉన్నారుగా మరో ఇద్దరు వాళ్ల దగ్గరికి వెళ్ళు అన్నారు. ఆ ఇద్దరి దగ్గరికి వెళితే వాళ్లు ఆమాటే అన్నారు.యాదయ్య ఆ రోజే ఆ ఊరు విడిచాడు. చాలా దూరం వెళ్లి ఓ పట్టణం దగ్గర మూడు ఎకరాల మెట్ట చేను కొన్నాడు. పెద్ద పాక వేసి బోరుబావి తవ్వించాడు. కంచ వెలుపల 'అన్నమ్మ వృద్ధాశ్రమం' అని బోర్డు పెట్టించాడు. ఓ నాలుగైదుగురు అనాధల తో ప్రారంభమైన ఆ వృద్ధాశ్రమం దిన దిన ప్రవర్ధమన మైయింది.
ఆశ్రమంలో ప్రహరీ గోడలా వెంబడే టేకు చెట్లు నాటించాడు. యాదయ్య అందరూ కలిసి కూరగాయల సాగుచేశారు. వాటిని మార్కెట్ వాళ్ళు వచ్చి కొనుక్కుపోతుంటారు. ఇప్పుడు ఆ ఆశ్రమంలో ఓ అరవై మంది దాకా వృద్ధులు ఉంటారు. యాదయ్య కు వందేళ్ళు నిండాయి.. మనిషి దృఢంగా ఉన్నాడు. ఓ రోజు ఆశ్రమం వార్షికోత్సవం జరిపాడు . ప్రముఖులు ప్రసంగిస్తూ యాదయ్యను ఎంతో పొగిడారు. యాదయ్య ఆశ్రమవాసుల్ని ఉద్దేశించి ప్రసంగించాడు. సోదరులారా! నేను ఈ ఆశ్రమం లో చేరిన మొదటి అనాధను ఇప్పుడు నాకు 60 మంది సోదరులు ఉన్నారు.
ఈ ఆశ్రమం మన తల్లి దీని ప్రగతికి పాటుపడదాం వేలకు తిందాం, వేలకు పడుకుందాం..వ్యాయామం చేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం..మన కోసం కాదు సుమా! రేపటి తరాల కోసం అన్నమ్మ వృద్ధాశ్రమం వర్ధిల్లాలి!
ఆశ్రమంలో చేరాలన్న ఆశతో వచ్చి ప్రేక్షకుల ముందు ప్రేత కళ తో కూర్చొని ఉన్న యాదయ్య ముగ్గురు కొడుకులు కూడా వర్ధిల్లాలి! అంటూ బిగ్గరగా వినధించారు.