మంచిమాట : సజ్జనుల సావాసం సత్ఫలితాలను ఇస్తుంది..!
అతడు ఆ చిలకనీ తను ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చిన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాడు. ఈ విధంగా ఆ చిలుక పిల్లలు వేటగాడి వల్ల విడిపోయి ఒకటేమో వేటగాడి వద్ద మరో ఒకటేమో సాధువు వద్ద పెరిగి పెద్దవయ్యాయి.అయితే ఒకానొక రోజు ఒక గొప్ప మహారాజు వేటకోసం అడవికి వచ్చి అనుకోకుండా వేటగాడి ఇళ్లు చూశాడు. ఆ మహారాజు తన గుఱ్ఱాన్ని తీసుకొని, వేటగాడి ఇంటి వైపు వెళ్ళాడు. అప్పుడు ఆ చిలక ఎవరో మన ఇంటి వైపు వస్తున్నారు..తొందరగా విల్లు ,బాణాలు తీసుకొని వచ్చి వాళ్లని చంపు అని అరవడం ఆ రాజు విన్నాడు. వెంటనే ఆ మాటలన్నది ఒక పంజరంలోని చిలకని మహారాజు గ్రహించాడు.
ఎంత విచిత్రమైన పక్షి ఇది..దాని యజమాని కూడా అలాగే ఉంటాడేమో అనుకుని రాజు తిరిగి చూడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అలా వెళుతూ వెళుతూ ఆ మహారాజు ఒక ముని ఆశ్రమం దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ దాహం తీర్చుకోవడానికి ఆగాడు. అక్కడ కూడా మహారాజుకి పంజరంలో ఒకచిలుక కనిపించింది. ఇది కూడా దుర్మార్గపు చిలుక అయి ఉంటుంది అని అనుకున్నాడు మహారాజు.. కానీ ఆ చిలుక రండి రండి మహారాజా..! మిమ్మల్ని మా నివాసానికి ఆహ్వానించడానికి ఎంతో సంతోషిస్తున్నాను. అని చిలుక పలుకులు విని ఆ మహారాజు ఎంతో ఆశ్చర్యపోయాడు.
వేటగాని ఇంటివద్ద తను చూసిన చిలక పోలికలతో కలిపి ఉన్న ఈ చిలుక వినయంగా మర్యాదగా తనను ఆహ్వానించడం చూసి రాజు విస్మయం చెందాడు. అప్పుడు రాజు చిలుక పంజరాన్ని సమీపించి..అరే నేను ఇప్పుడే నిన్ను పోలిన చిలుకను చూసి వచ్చాను. దాని ప్రవర్తన చాలా నీచంగా ఉంది. అయితే అది వేటగాని వద్ద ఉన్నదా..? అని అడిగింది చిలుక.. అవునవును..! నీకెలా తెలుసు అని అడిగాడు మహారాజు.. అది నా తమ్ముడు మేమిద్దరం ఒకే గూటి లో ఉండేవాళ్ళం.. ఒక రోజు మా అమ్మ గూటిలో లేని సమయంలో ఒక వేటగాడు మమ్మల్ని పట్టుకున్నాడు.
నేను తప్పించుకున్నాను. వేటగాడు నా తమ్ముడిని పట్టుకొని పోయాడు. దాని యజమాని నీచమైన వాడు కాబట్టి నా తమ్ముడు అలా తయారయ్యాడు. కానీ నా యజమాని అలాంటివాడు కాదు కదా అని ఏడుస్తూ చెప్పింది చిలుక.. ఆ సమాధానానికి రాజు ఎంతో సంతోషించి సాధువుని ఆ చిలుక ని పొగుడుతూ వెళ్ళిపోయాడు.