“శార్దూల్ వచ్చేయ్”...వన్డేల కోసమే..!

Bhavannarayana Nch

భారత జట్టు  దక్షిణాఫ్రికా చేతిలో వరుస రెండు  టెస్టు మ్యాచ్చుల్లో ఘోరమైన పరాజయం చవి చూసిన తరువాత కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టింది..ఈ నెల 24 న మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపధ్యంలో టీమిండియా ఆటగాడు ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఆడుతున్న శార్దూల్ కి దక్షిణాఫ్రికా వెంటనే రావాలని పిలుపు వచ్చింది..అయితే ఈ ఊచించని పరిణామం ఎందుకు అనే దానిపై సర్వాత్రా ఆశక్తి నెలకొంది..

 

ముంబై తరుపున సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఎంతో చక్కని ప్రతిభ కనపరుస్తున్న శార్దూల్ కి ఇలా పులుపు రావడంతో ఎగిరి గంతేశాడు..నేటి రాత్రికే ఆయన జొహెన్నెస్‌బర్గ్ బయలుదేరనున్నట్టు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) సంయుక్త కార్యదర్శి ఉన్మేష్ తెలిపారు. టీమిండియాకు ఇప్పటికే ఐదుగురు పేసర్లు ఉండగా మరొకరు ఎందుకు అనే విషయం ఇప్పుడు చర్చకు వస్తోంది..ఇప్పుడు శార్దూల్ పై మరింత ఒత్తిడి పెరిగింది కూడా..

 

ఇదిలా ఉంటే శార్దూల్ ని ఉన్నట్టుండి పిలవడానికి కారణం..వన్డేల కోసమని తెలుస్తోంది...అయితే శార్దూల్ ఆదివారం జొహెన్నెస్‌బర్గ్ చేరుకోనున్నాడు...అంతేకాదు ఈ నెల 24 నే ధోనీ సహా మరి కొందరు ఆటగాళ్ళు వన్డే సీరీస్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లనున్నారు..అయితే శార్దూల్ ని ముడుగానే మూడో టెస్టు మ్యాచ్ లో ఆడటానికి పిలిపించానున్నారు అని టాక్ మరి శార్దూల్ సేవలని టెస్టు నుంచీ ఉపయోగించుకుంటారా లేక వన్డే మ్యాచ్ లలో ఉపయోగిస్తారా అనేది తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: