జెర్సీ లేకుండా క్రికెటర్ పరుగు.. వీడియో వైరల్
ప్రస్తుతం యూఏఈలో టీ10 క్రికెట్ లీగ్ జరుగుతోంది. ఈ లీగ్లో భాగంగా సోమవారం సాయంత్రం నార్తన్ వారియర్స్, టీమ్ అబుదాబి జట్ల మధ్య 14వ లీగ్ మ్యాచ్ జరిగింది. అయితే మ్యాచ్ విరామ సమయంలో కాకుండా ఏకంగా జరుగుతుండగానే అబుదాబి ఆటగాడు రోషన్ తన జెర్సీ మార్చుకునేందుకు ప్రయత్నించాడు.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ అబుదాబి 10 ఓవర్లలో 123/3 స్కోర్ సాధించింది. లూక్రైట్(33), జో క్లార్క్(50), డకెట్(31) జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఆ తరువాత బ్యాటింగ్కు దిగిన నార్తన్ టీమ్ ఓపెనర్లు లెండిల్ సిమన్స్(37), వసీమ్ మహ్మద్(76) చెలరేగి ఆడడంతో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్ ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ రేపింది.