టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం అయి.. ఇప్పటికే వారం రోజులు అయింది. అయితే.... ఈ ఒలింపిక్స్ క్రీడాల్లో మన ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. తమదైన ఆట ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. ఇక అటు ఈ ఒలింపిక్స్ లో రోజుకో అరుదైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న బ్యాక్సింగ్ లో తోటి ఆటగాన్ని.. మరో ఆటగాడు నోటితో కొరికిన ఘటన వైరల్ అయిన సంగతి తెలిసిందే.
అయితే.. మరో అద్భుతమైన ఘటన చోటు చేసుకుంది. ఓ క్రీడాకారిణి.. ఏకంగా సెక్స్ లో వాడే కండోమ్ ను వాడి ఏకంగా ఒలింపిక్స్ పతకాన్ని సాధించిన రికార్డు సృష్టించింది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటి కండోమ్ వాడటమేంటని అనుకుంటున్నారా ? అవును ఎలానో ఇప్పుడు చూద్దాం. ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి కయాకింగ్ ప్లేయర్ జెస్సికా ఫాక్స్ సెక్స్ లో వాడేటు వంటి కండోమ్ను వాడి కాంస్యం సాధించింది. తనకు ఎదురైన సమస్యలో కండోమ్ ఎంతో హెల్ప్ చేసినట్లు స్వయంగా జెస్సికా పాక్స్ వెల్లడించింది.
రేస్ కారణంగా తన పడవ ముందు భాగం చాలా దెబ్బతిన్నదని పేర్కొన్న జెస్సికా పాక్స్...వేగం తగ్గకూడదని తనకు సంబంధించిన కోచ్ ఏదైనా పిండి లాంటి పదార్థం పెట్టాలని సూచనలు చేశాడని పేర్కొంది. అయితే.. రేస్ లో కోచ్ సలహ అసలు పనికి రాదని భావించి.... పిండి ప్లేస్ లో కండోమ్ తొడిగించినట్లు పేర్కొంది జెస్సికా పాక్స్. ఈ తర్వాత తన పడవకు ఎలాంటి సమస్య రాలేదని వెల్లడించింది. అయితే.. ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది జెస్సికా పాక్స్. ఇక ఈ పోటీలో ఆమెకు కాంస్య పతకం లభించింది. కొన్ని కారణాల వల్ల గోల్డ్ మెడల్ మిస్ అయిపోయింది జెస్సికా పాక్స్. ఇక ఈ ఘటనపై ఆమె కోచ్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాడు.