మా టాప్-2 బెర్త్ ఖాయం : పంత్

M Manohar
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా నిన్న దుబాయ్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ 50 లో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ భారత యువ వికెట్ కీపర్ అయిన రిషబ్ పంత్ పుట్టినరోజు అనే విషయం తెలిసిందే. ఇక నిన్న చెన్నై తో మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ పంత్ మాట్లాడుతూ... పుట్టినరోజు నాడు సాధించిన ఈ విజయం నాకు చెడ్డ కానుక ఏం కాదు. అయితే ఇది కఠినమైన మ్యాచ్... కానీ మేము దీనిని ఇంకా కష్టతరం చేసుకున్నాము. కానీ చివరకు మ్యాచ్ విజయం సాధించడం అనేది మంచి అంశమే. ఇక మొదట పవర్ ప్లేలో మా బౌలర్లు చాలా కష్టపడ్డారు. ఆ తర్వాత కూడా మేము కొన్ని మంచి ఓవర్లను బౌలింగ్ చేశాం. అయితే చివర్లో వారికి కొన్ని అదనపు పరుగులు వెళ్ళాయి. ఇక బ్యాటింగ్ లో పృథ్వీ షా మాకు మంచి ఆరంభాన్ని అందించాడు. అయితే లక్ష్యం చిన్నదే కాబట్టి మేము ఎప్పుడూ చేజింగ్ లో మేము ముందు ఉన్నాము.
అయితే మా ఓపెనర్ల లో పృథ్వీ షా ఎప్పుడు దూకుడుగా వ్యవహరిస్తుంటే దావన్ తనకు అండగా నిలుస్తాడు. ఈ మ్యాచ్ లో కూడా అదే జరిగింది. మా ఓపెనర్లు జట్టుకు కావాల్సిన ప్రారంభాన్ని ఇచ్చారు. ఇక చివర్లో షిమ్రాన్ హెట్‌మీర్ అద్భుతంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. ఇక ఈ విజయం తో ఐపీఎల్ పాయింట్ల పట్టిక లో టాప్-2 లో మా స్థానం ఖాయం అయిందని ఢిల్లీ కెప్టెన్ పంత్ చెప్పాడు. ఇక ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14 వ సీజన్ లో 13 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 10 విజయాలతో 20 పాయింట్లు తమ ఖాతాలో వేసుకుని ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టిక లో మొదటి స్థానంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: