భారత్ కు షాక్: నలుగురు బౌలర్లను ఇంటికి పంపిన బీసీసీఐ
ఇక ఈ రోజు నుండి సూపర్ 12 మ్యాచ్ లు జరగనున్నాయి. కానీ అందరి దృష్టి రేపటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పైనే ఉంది. కాగా ఇప్పుడు బీసీసీఐ భారత్ అభిమానులకు షాక్ ఇచ్చింది. భారత్ టీమ్ తో ఉన్న నలుగురు భారత్ బౌలర్లను ఇండియాకు పంపేసింది. ఐపిఎల్ పూర్తయిన వెంటనే కొందరు బౌలర్లను నెట్ లో బౌలింగ్ చేయించడానికి ఇక్కడే ఉంచుకున్నారు. వారిలో అవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, లుక్మాన్ మెరివాలా, కరణ్ శర్మ, సాబజ్ అహ్మద్, కృష్ణప్ప గౌతం మరియు వెంకటేష్ అయ్యర్ ఉన్నారు. ఈ ఎనిమిది మంది నుండి కరణ్ శర్మ, సాబజ్ అహ్మద్, కృష్ణప్ప గౌతం మరియు వెంకటేష్ అయ్యర్ లను ఇండియాకు పంపడం జరిగింది. వచ్చే నెల 4 నుండి స్థానిక సయ్యద్ ముస్తక్ అలి టోర్నమెంట్ ప్రారంభం కానుంది ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహించడానికి వీరిని పంపినట్లు బీసీసీఐ తెలిపింది.
మిగిలిన ఇండియన్ ఫేసర్లు మాతృ వరల్డ్ కప్ అయ్యేంత వరకు జట్టుతో ఉండనున్నారు. అయితే ప్రస్తుతం యూఏఈలో ఉన్న భారత బౌలర్ల ద్వారా నెట్ లో సాధన చేస్తే మనకు ఉపయోగపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్లో పిచ్ లపై హార్షల్ పటేల్ బౌలింగ్ ఆడితే ఉపయోగం ఉంటుంది, అలాగే మిగిలిన ఫాస్ట్ బౌలర్ల తో ప్రాక్టీస్ లాభదాయకం. మరి చూద్దాం రేపు జరగబోయే దాయాదుల పోరులో విజయం ఎవరిదో.