కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీ బాగుంది : రాహుల్ ద్రవిడ్
అతని వ్యూహాలు సరిగా లేకపోవడం వల్లనే దక్షిణాఫ్రికా అద్భుతమైన విజయం సాధించగలిగింది అంటూ కొంతమంది మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. టీమిండియాను సమర్థవంతంగా ముందుకు నడిపించడంలో కె.ఎల్.రాహుల్ పూర్తిగా విఫలం అయ్యాడు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న వేళ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందిస్తూ కెఎల్ రాహుల్ కు అండగా నిలిచాడు. కేఎల్ రాహుల్ రాహుల్ కెప్టెన్సీ బాగుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. సారథిగా తన బాధ్యతను చక్కగా నెరవేర్చాడని ప్రశంసలు కురిపించాడు. ఇప్పుడిప్పుడే జాతీయ జట్టుకు కెప్టెన్సీ చేపట్టిన కేఎల్ రాహుల్ పోను పోను కెప్టెన్సీలో మరింత మెరుగు పడతాడు అంటూ రాహుల్ ద్రావిడ్ చెప్పుకొచ్చాడు. సౌత్ ఆఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ లో మూడు మ్యాచ్ లలో ఓడిపోవడం మాకు కనువిప్పు లాంటిదే అంటూ రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగాల్సిందే అంటూ తెలిపాడు.