సెలూన్ నుండి ఐపీఎల్ వరకు.. ఇంతకీ ఎవరీ కుల్దీప్?
ఇటీవలే లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ లో ఆడిన తొలి మ్యాచ్ లలోనే తన సత్తా ఏంటో చూపించాడు. 140 కిలోమీటర్ల వేగంతో కీలక సమయంలో ఒక వికెట్లు పడగొట్టాడు. ఇక లక్నో విజయానికి ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరమైన సమయంలో సంజు శాంసన్ కుల్దీప్ సేన్ కి బౌలింగ్ ఇచ్చాడు. ఒత్తిడిని జయించి యువ ఆటగాడు అద్భుతంగా రాణించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. కుల్దీప్ సేన్ ప్రస్థానం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అని చెప్పాలి. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో హరిపూర్ కు చెందిన వాడు కుల్దీప్ సేన్. అతని తండ్రి పేరు రామ్ పాల్ సేన్. చిన్నపాటి సెలూన్ నడుపుతూ కుటుంబపోషణ చూసుకుంటున్నాడు. ఖాళీ సమయంలో కుల్దీప్ కూడా ఇక తండ్రికి చేదోడు వాదోడుగా సెలూన్ లో పనిచేసేవాడు.
చిన్నప్పటి నుంచి క్రికెట్ మీద ఆసక్తితో ఇక అటు వైపు అడుగులు వేసాడు కుల్దీప్. అతనికి కోచ్‌గా ఏరియల్ ఆంతోని ఉండేవారు. అతని వద్దే బౌలింగ్ స్కిల్స్ నేర్చుకున్నాడు. అతడి ప్రతిభకు మెచ్చి స్థానిక అకాడమీ ఫీజులు కూడా మాఫీ చేసింది అంటే అతని అంకితభావం ఏంటో అర్థం చేసుకోవచ్చు. మధ్యప్రదేశ్ జట్టు తరఫున 2018లో రంజీ ట్రోఫీలో ఆడిన కుల్దీప్ ఇందులో పంజాబ్ తో ఆడిన మ్యాచ్ లో 5 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు 16 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్ 44 వికెట్లతో అదరగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 17 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు కనీసం ధర 20 లక్షలకు అతని సొంతం చేసుకుంది.