అతని కెప్టెన్సి ధోనీలా ఉంది : మంజ్రేకర్
ఇలాంటి సమయం లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పై నమ్మకం ఉంచింది గుజరాత్ టైటాన్స్ జట్టు. జట్టు లో తీసుకోవడమే కాదు జట్టు సారథ్య బాధ్యతలను కూడా అప్పగించింది. ఈ క్రమం లోనే గుజరాత్ జట్టు అతని పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకో గలడా లేదా అని అనుకుంటున్న సమయంలో ఏకంగా హార్దిక్ పాండ్యా జట్టును ఎంతో సమన్వయంతో ముందుకు నడిపించి అదరగొట్టాడు. వరుస విజయాలు సాధిస్తూ జట్టును అగ్రస్థానంలో నిలిపాడు. ఇక చివరికి ఐపీఎల్ టైటిల్ను ఎగరేసుకుపోయాడు హార్దిక్ పాండ్యా.
ఈ క్రమం లోనే అతని కెప్టెన్సీ పై ప్రస్తుతం అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అనే చెప్పాలి. ఇటీవలే ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ అచ్చం మహేంద్ర సింగ్ ధోనీ లా ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లుగా పాండ్య నిర్ణయాలు తీసుకున్నాడు అని.. కెప్టెన్సీ ఎంజాయ్ చేస్తూ ఎంతో రిలాక్స్డ్ గా కనిపించాడు అంటూ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్ లో బౌలింగులో రాణిస్తూ అచ్చం ధోనీనీ తలపించాడు అంటూ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసలు కురిపించాడు..