బంగ్లాదేశ్ కు కొత్త కెప్టెన్.. ఎవరో తెలుసా?
అయితే అతని కెప్టెన్సీలో బంగ్లాదేశ్ జట్టు సరైన విజయం సాధించక పోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే జట్టుకు సరైన విజయాలు అందించిన లేనప్పుడు కెప్టెన్సీ చేయలేను అంటూ సారథ్య బాధ్యతలను వదులుకున్నాడు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ టెస్ట్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరు రాబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో సీనియర్ ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్న షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ టెస్ట్ కెప్టెన్ గా నియమితుడయ్యాడు అన్నది తెలుస్తుంది. ఇక వైస్ కెప్టెన్ గా లిటన్ దాస్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇటీవలే అధికారికంగా ప్రకటించింది.
ఇటీవల స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడిపోయింది బంగ్లాదేశ్ జట్టు. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్టుగా చెప్పడంతో.. కొత్త కెప్టెన్‌గా మరోసారి బంగ్లాదేశ్ టెస్టు జట్టు పగ్గాలు షకీబ్ అల్ హసన్ చేపట్టడం గమనార్హం. 2019లో కూడా అటు బంగ్లాదేశ్ టెస్ట్ కెప్టెన్ వ్యవహరించాడు ఈ ఆల్‌రౌండర్ పై ఐసీసీ నిషేధం విధించిన తెలిసిందే. ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ కి ముందు బుకీలు అతడిని సంప్రదించిన ఆ విషయాన్ని అతను దాచిపెట్టి అవినీతి నిరోధక భద్రత విభాగానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు దృష్టికి తీసుకెళ్లక పోవడంతో అతనిపై రెండేళ్ల పాటు నిషేధం పడింది. దీంతో అతని కెప్టెన్సీ కూడా కోల్పోయాడు..