దటీజ్ తిలక్ వర్మ.. ఒక్క రూపాయి ఉంచుకోలేదు?

praveen
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో తెర మీదికి వచ్చిన ప్రతిభ గల యువ ఆటగాళ్లతో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ  కూడా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మెగా వేలంలో ముంబై ఇండియన్స్ అతన్ని కొనుగోలు చేసింది. 1.70 కోట్లకు తిలక్ వర్మను జట్టులోకి తీసుకుంది ముంబై ఇండియన్స్. అయితే ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అటు ముంబై ఇండియన్ పేలవ  ప్రదర్శన చేసింది అనే విషయం తెలిసిందే. ఇకఅటు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఎంత పేలవ ప్రదర్శన చేసిన ప్రతీ మ్యాచ్లో  తిలక్ వర్మ మాత్రం మంచి ప్రదర్శన తో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు.

 14 మ్యాచ్లు ఆడిన తిలక్ వర్మ ఏకంగా 397 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థ సెంచరీలు కూడా ఉండటం గమనార్హం. ఇక తిలక్ వర్మ ఆటతీరుపై అటు కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఎంతోమంది మాజీ క్రికెటర్ల సైతం ప్రశంసలు కురిపించారు. తిలక్ వర్మ  టీమిండియా ఫ్యూచర్ స్టార్ అంటూ ప్రశంసించారు.. ఇలా ఒక మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చినా తిలక్ వర్మ తన ప్రతిభ తో ఆకట్టుకుని టీమిండియాలో కి వచ్చే లాగే కనిపించాడు. అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన తిలక్ వర్మ.. ఐపీఎల్ లో తనకు వచ్చిన 1.7 కోట్ల మొత్తాన్ని కూడా తండ్రికి ఇచ్చేశాడట.

 ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు. నా బుర్రలో ఆట తప్ప ఇంకేమీ ఆలోచనలు రానివ్వను.. అందుకే ఐపీఎల్ ద్వారా నేను పొందిన మొత్తాన్ని నా తండ్రికి ఇచ్చేసాను.. ఏ వ్యక్తి అయినా డబ్బుకు దాసోహం అవ్వడం సహజం. అందుకే డబ్బు ఉంచుకోవడం ద్వారా వచ్చే అనర్థాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు.. అందుకే ఐపీఎల్ ద్వారా వచ్చిన డబ్బును మా నాన్నకు ఇస్తూ ప్లీజ్ నన్ను వాటికి దూరంగా ఉంచండి అంటూ కోరాను అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలిసి అభిమానులు అతని గొప్ప వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: