రోహిత్ ఆరోగ్యంపై.. కూతురు సమైరా ముద్దు ముద్దు మాటల వీడియో?
ఈ క్రమంలోనే రోహిత్ శర్మ హెల్త్ గురించి అసలైన అప్డేట్ ఎవరు చెబుతారా అని అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో ఇక ఇటీవల హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గారాలపట్టి సమైరా తన తండ్రి ఆరోగ్యం ఎలా ఉంది అన్న విషయం గురించి ఇటీవల అప్డేట్ ఇచ్చింది. ఇక రోహిత్ శర్మ ఐసోలేషన్ లో ఉన్న నేపథ్యంలో అతని సతీమణి రీతిగా కుమార్తె సమైరా వేరేచోటికి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా హోటల్ లాడ్జిలో వారిని గమనించిన రోహిత్ అభిమానులు పలకరించారు. మీడియా వాళ్ళు మాట్లాడుతుంటే రోహిత్ సతీమణి రితిక పట్టించుకోలేదు కానీ రోహిత్ కూతురు సమైరా మాత్రం మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
హాయ్ బాగున్నావా అంటూ అడగగా.. బాగున్నాను అంటూ చెప్పింది. మీ నాన్న ఎక్కడ ఉన్నాడు అంటూ అడిగితే రూమ్ లో ఉన్నాడు విశ్రాంతి తీసుకుంటున్నాడు అంటూ ఆన్సర్ ఇచ్చింది. ఇప్పుడు ఆయన హెల్త్ ఎలా ఉంది బాగున్నాడా అంటూ అడిగాడు . ఇప్పుడు బాగున్నాడు కాని పాజిటివ్ వచ్చింది. ఆయన కోలుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది అంటూ సమైరా వ్యాఖ్యానించింది. ఇలా తన చిట్టి చిట్టి మాటలతో తన తండ్రి హెల్త్ అప్ డేట్స్ ఇచ్చిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. ఇది చూసి అభిమానులు అందరూ కూడా మురిసిపోతున్నారు.