పాకిస్థాన్ అథ్లెట్ పై నీరజ్ చోప్రా ప్రశంసలు.. ఏమన్నాడంటే?

praveen
భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ చోప్రా మరోసారి భారత ప్రజల గౌరవాన్ని నిలబెట్టాడు అన్న విషయం తెలిసిందే. ఒలింపిక్స్ లో భారత్ కి అందని ద్రాక్షలా ఉన్న గోల్డ్మెడల్ సాధించి దశాబ్దాల నిరీక్షణకు తెర దించాడు. ఇక ఇప్పుడు  ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో కూడా మరోసారి సత్తా చాటాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా రజత పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. అయితే 2003లో అంజు బాబీ జార్జ్ తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో మెడల్ సాధించిన మొట్టమొదటి భారత అథ్లెట్ గా  అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి.

 ఇలా గత ఏడాది గోల్డ్ మెడల్ ఈ ఏడాది సిల్వర్ మెడల్ సాధించి తనకు పోటీ ఏదైనా  తిరుగులేదు అని మాత్రం నీరజ్ చోప్రా నిరూపిస్తున్నాడు అని చెప్పాలి. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో భాగంగా ఎంతో అలవోకగా ఫైనల్లో అడుగుపెట్టినా నీరజ్ చోప్రా ఫైనల్లో నాలుగో రౌండ్లో 88.13 మీటర్ల దూరం జావెలిన్ త్రో విసిరి ఒలంపిక్స్ లో తాను సాధించిన బంగారు పతకం గాలివాటం కారణంగా వచ్చింది కాదు అంటూ నిరూపించి ఎంతోమంది నోళ్లు మూయించాడు అని చెప్పాలి. అయితే గతంలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించిన సమయంలో కేవలం గాలివాటం కారణంగానే అతను గోల్డ్మెడల్ సాధించగలిగాడు అంటూ అందరూ కామెంట్లు చేశారు.

 ఇకపోతే ఇక ఈ పోటీల అనంతరం మీడియాతో మాట్లాడిన జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా తాను పాకిస్తాన్ జావలిన్ త్రో అర్షద్ తో ముచ్చటించినట్లు చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా అతనితో ఏం మాట్లాడాడు అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఆ పోటీ ముగిసిన తర్వాత నేను పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ తో మాట్లాడాను. అతడు చాలా మంచి ప్రదర్శన  చేశాడని ప్రశంసించా. అప్పుడు అతను స్పందిస్తూ తన మోచేతికి గాయమైందని నాతో చెప్పాడు. గాయం ఉన్న సమయంలో కూడా 86 మీటర్లు త్రో విసరడం  చాలా గొప్ప విషయమని నీరజ్ చోప్రా మీడియాకు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: