టి20 వరల్డ్ కప్.. ఫైనల్ వెళ్ళేది ఆ రెండు జట్లే : రికీ పాంటింగ్

praveen
గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా ఎంత చెత్త ప్రదర్శన చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన టీమిండియా ప్రత్యర్థులను ఎదుర్కోలేక చతికిలబడి పోయింది. ఈక్రమంలోనే గ్రూప్ దశలోనే టి20 వరల్డ్ కప్ నుంచి వెనుదిరిగింది అనే విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే ఎవరూ ఊహించని విధంగా మొట్టమొదటిసారి ఆస్ట్రేలియా జట్టు టి-20 వరల్డ్ కప్ టైటిల్ నెగ్గింది.

 ఇకపోతే 2022 టి20 ప్రపంచకప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. ఇక ఈ ప్రపంచకప్కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వబోతోంది. అక్టోబర్ నుండి ప్రపంచకప్ ప్రారంభ మవుతుంది. ఈ క్రమంలోనే ఇక ఈ టి 20 ప్రపంచకప్ కోసం అత్యుత్తమ జట్టును బరిలోకి దింపేందుకు ఆయా దేశాలు కూడా సిద్ధమైపోయాయ్. ఇక టి20 ప్రపంచకప్లో ప్రస్తుతం కంగారు జట్టు హాట్ ఫేవరెట్ లలో ఒకటిగా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఇక ఇటీవల ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. టి 20 ప్రపంచకప్లో భాగంగా తప్పకుండా భారత్ ఆస్ట్రేలియా జట్లు ఫైనల్కు చేరుకుంటాయ్ అంటూ అంచనా వేశాడు రికీపాంటింగ్.

 అదే సమయంలో హోమ్ కండిషన్స్ మిగితా అంశాల ఆధారంగా ఫైనల్లో భారత్ పై ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించడం ఖాయం అంటూ జోస్యం చెప్పాడు ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్. ఇక ఈ ఏడాది టి20 వరల్డ్ కప్ లో భారత్ ఆస్ట్రేలియా జట్ల ప్రమాదకరంగా కనిపిస్తున్నాయని వీటితోపాటు ఇంగ్లాండ్ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది అంటూ తెలిపాడు. ఇటీవల ఐసీసీ నిర్వహించిన ఒక రివ్యూ కార్యక్రమంలో మాట్లాడిన రికీ పాంటింగ్  ఈ వ్యాఖ్యలు చేశాడు. మరి ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్ను ఎవరు ముద్దాడుతారూ అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. మరికొంత మంది మాజీ క్రికెటర్లు కూడా టి20 వరల్డ్ కప్ లో విజయం సాధించే జట్టు ఏది అన్నదానిపై అంచనాలు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: