హార్థిక్ పాండ్యా రవిశాస్త్రిలా ఆడుతాడు : సునీల్ గవాస్కర్
ఈ క్రమంలోనే హార్థిక్ పాండ్యా టీమిండియా జట్టులో ఉన్నాడు అంటే చాలు 11 మంది ప్లేయర్లు కాదు ఏకంగా 12 మంది జట్టులో ఉన్నట్లే అంటూ ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి. కాగా మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టును బిసిసిఐ ఇటీవలే ప్రకటన చేసింది. అందరూ అనుకున్నట్లుగానే హార్దిక్ పాండ్యాకు జట్టులో చోటు దక్కింది అన్న విషయం తెలిసిందే. అయితే టి 20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్యా ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై ఇటీవల మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రపంచ కప్లో టీమ్ ఇండియాకు హార్దిక్ పాండ్యా ఎంతో కీలకంగా మారబోతున్నాడు అంటూ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇక తన ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటాడు అంటూ చెప్పుకొచ్చాడు. 1985 ప్రపంచ ఛాంపియన్షిప్లో తన ఆల్రౌండ్ ప్రదర్శనతో రవి శాస్త్రి టీమిండియా విజయాల్లో ఎంతగానో కీలక పాత్ర వహించాడు. ఇక ఎప్పుడూ టీ20 ప్రపంచ కప్ లో హార్దిక్ పాండ్యా నుంచి రవిశాస్త్రి లాంటి ప్రదర్శనలు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు అంటూ సునీల్ గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు అని చెప్పాలి. మరికొంత మంది కూడా హార్థిక్ పాండ్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు.