సరదాగా సిట్టింగేసిన రషీద్ ఖాన్, షాహిన్ అఫ్రిది.. వీడియో వైరల్?
అయితే అటు వరల్డ్ కప్ పై ప్రేక్షకులందరరికి మరింత ఆసక్తి పెంచే విధంగా ఇక ఏ చిన్న ఆసక్తికర వీడియో కనిపించిన కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూనే ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా ప్రత్యర్ధులుగా కొనసాగుతున్న రెండు జట్లకు సంబంధించిన ఆటగాళ్లు ఎప్పుడైనా సరదాగా ముచ్చటించారు అంటే చాలు ఇక అది అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. వరల్డ్ కప్ కి ముందు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు వార్మప్ మ్యాచ్ లు ఆడుతున్నాయి అన్న విషయం తెలిసిందే.
అయితే సుదీర్ఘ విరామం తర్వాత గాయం నుంచి కోలుకొని పాకిస్తాన్ జట్టులో చేరిన షాహిన్ ఆఫ్రిది ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ డగ్ అవుట్ లో కూర్చుని హాయిగా ముచ్చటించడం గమనార్హం. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న 15 ఓవర్ లో ఈ ఘటన జరిగింది. ఇక వీరిద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటున్న వీడియోని సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది ఐసీసీ. ఈ వీడియోలో చూసుకుంటే షాహిన్ ఆఫ్రిది ఏదో చెబుతూ ఉంటే రషీద్ ఖాన్ చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు. అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసింది అన్న విషయం తెలిసిందే.